ఆ టిడిపి నాయకుడి వల్లే ఇక్కడ అభివృద్ది....ఇప్పుడు మళ్లీ కేసీఆర్: హరీష్

By Arun Kumar PFirst Published Nov 26, 2018, 8:00 PM IST
Highlights

రాజధాని హైదరాబాద్ కు అతి దగ్గర్లో వున్న భువనగిరి నియోజకవర్గ అభివృద్దిని ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ పాలనలో ఏ ఒక్క నాయకుడు పట్టించుకోలేదని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఇక్కడ గతంలో మాజీ హోంమంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి హయాంలోనే  కాస్త అభివృద్ది జరిగిందన్నారు. ఆ తర్వాత మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఇక్కడి  ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి నియోజకవర్గ అభివృద్దికి పాటుపడ్డారని హరీష్ తెలిపారు. 
 
భువనగిరి నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి ఫైళ్ల శేఖర్ రెడ్డి తరపున ప్రచారంలో పాల్గొన్న హరీష్ వలిగొండలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...రాష్ట్రంలో అభివృద్ది పనులు కొనసాగాలంటూ మళ్లీ టీఆర్ఎస్ పార్టీనే గెలిపించాలని ప్రజలకు సూచించారు. గతంలో స్థానిక ఎమ్మెల్యేగా పనిచేసిన మాధవ రెడ్డి 100 పడకల ఆస్పత్రి కట్టిస్తే దాన్ని 350 పడకల ఆస్పత్రిగా తమ ప్రభుత్వం మార్చిందన్నారు. ఆ  మధ్య కాలంలో ఎవరూ దాన్ని పట్టించుకోలేదని హరీష్ తెలిపారు. 

  కాంగ్రెస్ నాయకులు తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ ను జైళ్లో పెడతామంటున్నారని...అయితే వారు ఆ పని ఎన్నటికీ చేయలేరన్నారు. ఎందుకంటే వారికి కూడా కాంగ్రెస్ అధికారంలోకి రాదని తెలుసన్నారు. అందువల్లే ఇలా ప్రగల్భాలతో ప్రచారం కొనసాగిస్తున్నారని అన్నారు. కానీ తాము చేసిన అభివృద్ది గురించి ప్రచారం చేస్తూ ప్రజలకు దగ్గరవుతున్నట్లు హరీష్ స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తలు

రాజకీయ సన్యాసం చేస్తా:కేటీఆర్ సవాల్‌ను స్వీకరించిన కోమటిరెడ్డి

కారు డ్రైవర్ కేసీఆరే: సీఎం పదవిపై కేటీఆర్ వ్యాఖ్యలు

హైదరాబాద్‌‌పై బాబు కామెంట్స్‌కు కేటీఆర్ కౌంటర్

హైద్రాబాద్ అభివృద్ధి నాదే, కేసీఆర్‌కు ఆ సత్తా లేదు: బాబు

కాంగ్రెస్‌కు షాక్: టీఆర్ఎస్‌లో చేరనున్న చెరుకు ముత్యం రెడ్డి

ఆ ఆరుగురు ఎవరో: కాంగ్రెస్ పార్టీ జాబితా విడుదలలో ఉత్కంఠ

రాజకీయ సన్యాసం చేస్తా:కేటీఆర్ సవాల్‌ను స్వీకరించిన కోమటిరెడ్డి

కారు డ్రైవర్ కేసీఆరే: సీఎం పదవిపై కేటీఆర్ వ్యాఖ్యలు

హైదరాబాద్‌‌పై బాబు కామెంట్స్‌కు కేటీఆర్ కౌంటర్

హైద్రాబాద్ అభివృద్ధి నాదే, కేసీఆర్‌కు ఆ సత్తా లేదు: బాబు

ఎట్టకేలకు మర్రి, పొన్నాల సీట్లకు లైన్‌క్లియర్

మహాకూటమికి సెగ: ఢీకొట్టేందుకు రెబెల్స్ కూటమి

click me!