కరీంనగర్ కు మంత్రి ఈటల శుభవార్త

First Published May 28, 2018, 4:21 PM IST
Highlights

ఉద్యోగులకు, జర్నలిస్టులకు కూడా

కరీంనగర్ లో ఉద్యోగులు, జర్నలిస్టుల కోసం వెల్నెస్ సెంటర్ తోపాటు డయాలసిస్ సెంటర్, నగరంలో మూడు  అర్బన్ హెల్త్ సెంటర్ లను మంత్రులు ఈటల రాజేందర్, లక్ష్మారెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణలో అనేక మార్పులు జరిగాయన్నారు. కేంద్ర ప్రభుత్వాలు ప్రజలకు విద్య, వైద్యాన్ని నిర్వీర్యం చేశాయన్నారు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వీటికే పెద్దపీట వేసిందన్నారు. కరీంనగర్ జిల్లాకు 750 పడకల ఆసుపత్రి 250 కోట్లతో త్వరలోనే ప్రారంభం చేసుకొంటామని మంత్రి ప్రకటించారు.

సమావేశంలో ఆరోగ్య శాఖ మంత్రి  లక్ష్మారెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వాల పనితీరుకు నేటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాలనకు చాలా వ్యత్యాసం ఉందన్నారు. రోగులకు అన్ని రకాల సదుపాయాలతో పాటు ఉచితంగా వైద్య సధుపాయాన్నిస్తున్నామని చెప్పారు. డయాలసిస్ సెంటర్ లను కార్పొరేట్ హాస్పిటల్ లకు ధీటుగా వైధ్యసేవలను అందిస్తున్నామన్నారు. దూరప్రాంతాలకు వెళ్ళి వైద్యం చేసుకునే వారికి ఈ సెంటర్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. బస్తి దావఖానాలను నగరంలో త్వరలోనే ఏర్పాటు చేస్తామన్నారు.

ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ అబద్ధం మీద ఆధారపడి న ఒక జర్నలిస్టు ల జాతర నేడు హైదరాబాద్ లో జరుగుతొందన్నారు. తెలంగాణ జర్నలిస్టుల కు ఉన్న హెల్త్ కార్డ్ లు దేశంలో ఎక్కడా లేవన్నారు. రాష్ట్రంలో ఇది ఐదవ వెల్ నెస్ సెంటర్ అని చెప్పారు. కరీంనగర్ ఆదిలాబాద్ మంచిర్యాల జగిత్యాల పెద్దపెల్లి సిరిసిల్ల లకు సంబంధించిన జర్నలిస్టు లు ఈ కరీంనగర్ వెల్ నెస్ సెంటర్ ను వినియోగించుకోవాలని సూచించారు.

click me!