
తెలంగాణ సిఎం కేసిఆర్ ఢిల్లీలో బిజి బిజిగా గడుపుతున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సోమవారం మధ్యాహ్నం కలిశారు. కొత్త జోనల్ విధానం గురించి హోంశాఖ మంత్రితో సీఎం చర్చించారు. రాష్ట్రంలో 7 జోన్లు, 2 మల్టీ జోన్ల వ్యవస్థ ఏర్పాటు చేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కొత్త జోనల్ విధానంపై ప్రధాని మోదీతో కూడా చర్చించే అవకాశం ఉంది. జోనల్ వ్యవస్థ ఏర్పాటుకు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరడానికి ముఖ్యమంత్రి కేసీఆర్.. క్యాబినెట్ సమావేశం అనంతరం ఆదివారం సాయంత్రం ఢిల్లీకి బయల్దేరిన విషయం విదితమే.