రామభక్తి ఉంటే భారతీయుడు కాడు: అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Feb 02, 2020, 06:55 PM IST
రామభక్తి ఉంటే భారతీయుడు కాడు: అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు

సారాంశం

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రామభక్తి భావజాలాలు ఉన్నవాడు భారతీయుడు కాదని, అంబేద్కర్, గాంధీ భావజాలాలు ఉన్నవాడే భారతీయుడని ఒవైసీ వ్యాఖ్యానించారు.

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రామభక్తి భావజాలాలు ఉన్నవాడు భారతీయుడు కాదని, అంబేద్కర్, గాంధీ భావజాలాలు ఉన్నవాడే భారతీయుడని ఒవైసీ వ్యాఖ్యానించారు.

సీఏఏ, ఎన్ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌లకు వ్యతిరేకంగా ఆందోళనలు చేశామని.. అంతేకాకుండా ఈ చట్టాలపై సుప్రీంకోర్టులోనూ పోరాడుతున్నామని ఒవైసీ స్పష్టం చేశారు. బీజేపీ ప్రభుత్వం చేసిన ఈ చట్టాలను దేశవ్యాప్తంగా ప్రజలు వ్యతిరేకిస్తున్నారని ఆయన గుర్తుచేశారు.

తాము జైల్ భరో నిర్వహిస్తే, దేశంలో జైళ్లు సరిపోవని అసదుద్దీన్ చెప్పారు. ఈ ఉద్యమం ఎన్ని రోజులు జరుగుతుందో చెప్పలేమని.. ఇప్పటికే ఈ వ్యతిరేకత మొదలై 50 రోజులు దాటిందన్నారు. 

Also Read:

ఆ విషయంలో కాంగ్రెస్‌, టీఆర్ఎస్‌దీ ఒకే బాట, కానీ.... తెలంగాణలో ఇలా..

కరీంనగర్ కార్పోరేషన్ కమిషనర్ సీసీ రాకేష్ లైక్ వీడియోలు

మా అమ్మను కాపాడండి కోరిన టెక్కీ: కేటీఆర్ స్పందన ఇదీ

PREV
click me!

Recommended Stories

ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పవర్ ఫుల్ స్పీచ్ | KCR Powerful Speech at Praja Ashirvada Sabha
KCR: నా కొడకా.. నా చావు కోరుకుంటావా? వెయ్యి జన్మలెత్తినా నన్ను ఏమీ చేయలేరు ! కేసీఆర్ మాస్ కౌంటర్