రంగారెడ్డి జిల్లాలో దారుణం: కారులో తిప్పుతూ వివాహితపై గ్యాంగ్ రేప్

By narsimha lode  |  First Published Feb 19, 2023, 9:39 AM IST

దేశ వ్యాప్తంగా  పలు  రాష్ట్రాల్లో  మహిళలపై  అత్యాచారాల నివారణకు  ప్రభుత్వాలు  అనేక చర్యలు తీసుకుంటున్నా  ఫలితం లేకుండా  పోయింది.  రంగారెడ్డి జిల్లాలో  వివాహితపై గ్యాంగ్ రేప్ చోటు  చేసుకుంది. 



హైదరాబాద్:  రంగారెడ్డి జిల్లాలోని  పీరం చెరువు వద్ద  దోపిడి దొంగలు  దారుణానికి పాల్పడ్డారు.  వివాహితను  కిడ్నాప్  చేసి  కారులోనే  సామూహిక అత్యాచారానికి  పాల్పడ్డారు.మహిళ వద్ద  ఉన్న బంగారు ఆభరణాలను  కూడా  దుండగులు దోచుకున్నారు.  బాధితురాలు  నార్సింగి  పోలీసులకు ఫిర్యాదు  చేసింది. 

ఎర్ర రంగు  కారులో పీరం చెరువు  వద్ద  వివాహితను  దుండగులు  కిడ్నాప్  చేశారు.  కారులో  వివాహితను  కిస్మిత్ పూర్ వైపునకు తీసుకెళ్లారు. చివరకు గండిపేట వద్ద  నిందితులు  ఆమెను వదిలేశారు. వివాహితకు మద్యం  తాగించి  నిందితులు  అత్యాచారానికి పాల్పడ్డారు.  మత్తు నుండి తేరుకున్న తర్వాత వివాహిత  తన  భర్తకు  ఫోన్  చేసింది.  ఈ ఘటనకు  సంంబంధించి  భర్తతో కలిసి  బాధితురాలు  పోలీసులకుఫిర్యాదు  చేసింది. 

Latest Videos

మహిళలపై అత్యాచారాల ఘటనలు  తెలంగాణ, ఏపీ రాష్ట్రాలతో  పాటు  దేశ వ్యాప్తంగా  ఇటీవల  కాలంలో  ఎక్కువగా నమోదౌతున్నాయి.  ప్రతి రోజూ  దేశంలో  ఏదో ఒక చోట  ఈ తరహ కేసులు  వెలుగు చూస్తున్నాయి. 

 తెలంగాణ రాష్ట్రంలోని హైద్రాబాద్ లో  మైనర్ బాలికపై  సామూహిక అత్యాచారానికి  పాల్పడిన ఐదుగురిని  ఈ నెల  9వ తేదీన  పోలీసులు అరెస్ట్  చేశారు. బాలికను ట్రాప్  చేసిన వారిలో  ఇద్దరు ఇంటర్ విద్యార్ధులు కూడా  ఉన్నారని  పోలీసులు  చెప్పారు.

హైద్రాబాద్ నగరంలోని హయత్ నగర్ లో  గత ఏడాది  డిసెంబర్  1వ తేదీన    టెన్త్ క్లాస్ విద్యార్ధినిపై   స్నేహితులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఫోర్న్  వీడియోలు  చూసి  విద్యార్ధినిపై  సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో  ఐదుగురు నిందితులను  పోలీసులు అరెస్ట్  చేశారు. హైద్రాబాద్ నగరంలోని  9వ తరగతి  విద్యార్ధిని కిడ్నాప్  చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు నిందితులు.ఈ ఘటన  2022 నవంబర్  6వ తేదీన  చోటు  చేసుకుంది. 

also read:దారుణం.. ఉన్నావ్‌లో బర్త్‌డే పార్టీకి పిలిచి.. డ్యాన్సర్ పై సామూహిక అత్యాచారం..

హైద్రాబాద్ పాతబస్తీలో గల ఛత్రినాక  పోలీస్ స్టేషన్ పరిధిలో  వివాహితపై  సామూహిక అత్యాచారానికి పాల్పడిన  ఇద్దరు నిందితులను  పోలీసులు గత ఏడాది నవంబర్  11న  పోలీసులు అరెస్ట్  చేశారు. వివాహితను ఇద్దరు  బైక్ పై కిడ్నాప్ చేసి  లైంగిక దాడికి పాల్పడ్డారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని   బధిర బాలికపై   ఇద్దరు మైనర్లు  సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.   ఈ  ఘటన  2022 అక్టోబర్  19న జరిగింది.  

click me!