గండిపేటలో భారీ అగ్నిప్రమాదం.. యూనియన్ బ్యాంక్ పైఅంతస్తులో చెలరేగిన మంటలు..

Published : May 27, 2023, 12:54 PM IST
గండిపేటలో భారీ అగ్నిప్రమాదం.. యూనియన్ బ్యాంక్ పైఅంతస్తులో చెలరేగిన మంటలు..

సారాంశం

హైదరాబాద్‌ శివార్లలోని  గండిపేటలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. యూనియన్ బ్యాంక్ కార్యాలయం పైఅంతస్థులో మంటలు చెలరేగాయి. 


హైదరాబాద్‌ శివార్లలోని  గండిపేటలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. యూనియన్ బ్యాంక్ కార్యాలయం పైఅంతస్థులో మంటలు చెలరేగాయి. మంటలు పెద్ద ఎత్తున చెలరేగడంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగ అలుముకుంది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు శ్రమిస్తున్నారు. అయితే అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న అంతస్థులో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పిందని అంటున్నారు. 

మరోవైపు మంటలు యూనియన్ బ్యాంక్‌ కార్యాలయం ఉన్న అంతస్తులోకి వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఉద్యోగులకు బయటకు పంపించారు. అయితే షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Ganesh Laddu Auction 2026: ఈసారి అత్యధిక ధర పలికిన టాప్ 10 లడ్డూ వేలాలు ఇవే
KTR: చాలా ఏళ్ల త‌ర్వాత ఈరోజు థియేటర్‌కి వెళ్తున్నా.. వైర‌ల్ అవుతోన్న కేటీఆర్ ట్వీట్