పహాడీషరీఫ్‌లో డ్రమ్‌లో డెడ్ బాడీ.. వెలుగులోకి కొత్త కోణం.. ఆమె పనేనా..?

Published : May 27, 2023, 12:06 PM IST
పహాడీషరీఫ్‌లో డ్రమ్‌లో డెడ్ బాడీ.. వెలుగులోకి కొత్త కోణం.. ఆమె పనేనా..?

సారాంశం

పహాడీషరీఫ్‌లో డ్రమ్‌లో డెడ్ బాడీ దొరికిన ఘటన తీవ్ర కలకలం రేపిన  సంగతి  తెలిసిందే. ఆ మృతదేహాం.. పురానా సింగ్‌దిగా పోలీసులు గుర్తించారు. అయితే ఈ కేసుకు సంబంధించి కొత్త కోణం వెలుగులోకి వచ్చింది.

హైదరాబాద్:  పహాడీషరీఫ్‌లో డ్రమ్‌లో డెడ్ బాడీ దొరికిన ఘటన తీవ్ర కలకలం రేపిన  సంగతి  తెలిసిందే. అయితే ఆ మృతదేహాం.. పురాణ్ సింగ్‌దిగా పోలీసులు గుర్తించారు. అతడు చాంద్రాయణగుట్టలోని బండ్లగూడలో పానీపూరీ దుకాణం నడుపుతున్నాడని తేలింది. అయితే ఈ కేసుకు సంబంధించి కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. పురాణ్ సింగ్‌ను కిడ్నాప్ చేసి హత్య చేసినట్టుగా అనుమానాలు బలపడుతున్నాయి. అతడి ట్రాప్ చేసి హత్య చేసినట్టుగా గుర్తించినట్టుగా తెలుస్తోంది. మరోవైపు పురాణ్ సింగ్ భార్య మమతా దేవి కూడా ఇదే రకమైన ఆరోపణలు చేసింది. ‘‘నా భర్తపై జయదేవి అనే మహిళ వేధింపులకు పాల్పడుతుంది. ఆమెను పెళ్లి చేసుకోవాలని వెంట పడింది. నా భర్తను జయదేవి ట్రాప్ చేసింది.. ఆ తర్వాత హత్య చేసింది’’ అని పురాణ్ సింగ్ భార్య ఆరోపించారు. 

తనను వదిలేసి ఆమెను పెళ్లి చేసుకోవాలని తన భర్తను జయదేవి వేధించేదని పురాణ్ సింగ్ భార్య ఆరోపించింది. పెళ్లి చేసుకోకపోతే చంపేస్తానని తన భర్తను బెదిరించిందని చెప్పింది. తన భర్తను హత్య చేసింది జయదేవినే అని ఆరోణలు చేసింది. 

ఇదిలా ఉంటే.. పురాణ్ సింగ్ ఈ నెల 22 నుంచి కనిపించడం లేదని చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. దీని ఆధారంగా దర్యాప్తు జరిపిన పోలీసులు చివరకు పూరానా సింగ్ హత్యకు గురైనట్లు తేల్చారు. ఈ కేసుకు సంబంధించి తదుపరి దర్యాప్తు కొనసాగుతుంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

రేవంత్‌రెడ్డిపై భోరున ఏడ్చిన కొండా సుష్మిత | Konda Sushmita Emotional Comments On CM Revanth Reddy
Student Scholarship: విద్యార్థులకు బంపర్ ఆఫర్.. ఏడాదికి రూ. 12,000 స్కాలర్‌షిప్, అప్లై పూర్తి వివరాలు ఇవే