ప్రేమించి పెళ్లిచేసుకున్నా.. నా పరిస్థితి ఎవరికీ రావొద్దు.. సెల్ఫీ వీడియో తీసుకుని యువతి ఆత్మహత్యాయత్నం..

Published : Sep 28, 2022, 10:21 AM ISTUpdated : Sep 28, 2022, 10:38 AM IST
ప్రేమించి పెళ్లిచేసుకున్నా.. నా పరిస్థితి ఎవరికీ రావొద్దు.. సెల్ఫీ వీడియో తీసుకుని యువతి ఆత్మహత్యాయత్నం..

సారాంశం

ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ యువతి.. భర్త, అత్తింటివారి వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నం చేసింది. పురుగుల మందు తాగేముందు సెల్ఫీ వీడియో తీసుకుంది. 

వరంగల్ : ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ యువతి భర్తతో పాటు అతడి బంధువులు వేధింపులు తాళలేక క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటన గీసుకొండ మండలం కోట గండి వద్ద మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ఖానాపురం మండల కేంద్రానికి చెందిన ఇబ్రహీం, నసీమా దంపతులకు కూతురు నూర్జహాన్. అదే గ్రామానికి చెందిన రవి, అరుణ దంపతుల కుమారుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.  తర్వాత హైదరాబాదులో కాపురం పెట్టారు.

ఆ తర్వాత కొన్ని రోజులకు భర్త శరత్ తో పాటు అత్తమామలు,  ఆడబిడ్డ, ఆమె భర్త కట్నం కోసం వేధిస్తూ చిత్రహింసలకు గురి చేశారు. దీనిపై పలుమార్లు గ్రామంలో నిర్వహించినా..  వారి తీరు మారలేదు. వారి వేధింపులు భరించలేక నూర్జహాన్ మంగళవారం సాయంత్రం గీసుకొండ మండలం అడగండి వద్దకు వచ్చి క్రిమిసంహారక మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అపస్మారకస్థితిలో ఉన్న ఆమెను స్థానికులు చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే, మందు తాగే ముందు నూర్జహాన్ సెల్ ఫోన్ లో తన బాధను వీడియో తీసి తెలిసినవారికి వాట్సాప్ లో పెట్టింది.

సోషల్ మీడియాలో వీడియోలు చేస్తోందని.. భార్యను గొంతునులిమి చంపి, రాత్రంతా శవం పక్కనే..

ఎక్కడికి వెళ్ళినా న్యాయం జరగలేదు..
‘నా చావుకు కారణం మాత్రం నా హస్బెండ్, మా ఆడబిడ్డ, మా బావ,  మా అత్తమామలు.. నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నా.. క్యాస్ట్ తక్కువని, కట్నంకోసం కొట్టడంతో పాటు చంపేస్తామని వారు బెదిరిస్తున్నారు.  చాలా పీఎస్ లు తిరిగాను. నాకు ఎక్కడా న్యాయం జరగలేదు. ఉమెన్ పిఎస్ కు వెళ్ళినా అక్కడ సీఐ సారు వాళ్ళ వద్ద మనీ తీసుకుని నాకు న్యాయం చేయలేదు. ఎక్కడికి వెళ్లినా న్యాయం జరగడం లేదు. అందుకే చనిపోతున్నా.. నాలాంటి  పరిస్థితి ఇంకో అమ్మాయికి రాకుండా చూడండి..  ప్లీజ్’ అని ఒక వీడియో లో పేర్కొంది. మరో వీడియోలో ‘అన్నా.. వినయ్ రెడ్డి అన్నా.. థాంక్యూ వెరీ మచ్ అన్నా..  ఒక చెల్లిగా నాకు సహాయం చేసినందుకు థాంక్యూ అన్నా’  అంటూ మరో వీడియో నూర్జహాన్ పోస్ట్ చేసింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

సంధ్య థియేటర్ కేసు విచారణకు వర్చువల్‌గా హాజరైన అల్లు అర్జున్ | Asianet News Telugu
Pawan Kalyan అంటే భయమా? | Janasena Leader Shankar Goud fire on Jagadeesh Reddy | Asianet News Telugu