ఈ నెల 25న ఉప్పల్ స్టేడియంలో జరిగిన క్రికెట్ మ్యాచ్ సమయం తప్పుగా ముద్రించారని బేగంపేట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. . ఈ మేరకు ఓ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
హైదరాబాద్:హెచ్ సీ ఏ పై మరో కేసు
నమోదైంది.ఈ నెల 25వ తేదీన ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఇండియా, అస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ కు సంబంధించి న సమయాన్ని టికెట్లపై తప్పుగా ముద్రించారని బేగంపేట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.
ఈ నెల 22న జింఖానా గ్రౌండ్స్ లో జరిగిన తొక్కిసలాట సందర్భంగా హెచ్ సీ ఏ పై మూడు కేసులు నమోదయ్యాయి. తాజాగా మరో కేసు నమోదైంది. ఈ నెల 25 న జరిగిన ఇండియా, అస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ కు సంబంధించి టికెట్ల విక్రయానికి సంబంధించి మొదటి నుండి గందరగోళం చోటు చేసుకుంది. టికెట్ల విక్రయాన్ని పేటీఎంకు కాంట్రాక్టుకు ఇచ్చినందున తమకు ఎలాంటి సంబంధం లేదని హెచ్ సీ ఏ ప్రకటించింది., మ్యాచ్ నిర్వహణకు సంబంధించి తాము ఏర్పాట్లు చేశామని హెచ్ సీ ఏ అధ్యక్షుడు అజహరుద్దీన్, కార్యదర్శి విజయానంద్ చెప్పారు. ఉఏప్పల్ స్టేడియంలో జరిగిన క్రికెట్ మ్యాచ్ కు సంబంధించిన సమయం తప్పుగా ముద్రించారని ఓ యువకుడు బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నెల 25వ తేదీన రాత్రి ఏడుగంటలకే మ్యాచ్ ప్రారంభమైంది. అయితే టికెట్లపై మ్యాచ్ రాత్రి ఏడున్నర గంటలకు ప్రారంభం కానున్నట్టుగా సమయం ముద్రించారని ఆ యువకుడు బేగంపేట పోలీసులకు పిర్యాదు చేశాడు.ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.
undefined
ఈ నెల 22న జింఖానా గ్రౌండ్స్ లో ఇండియా, అస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ టికెట్ల కోసం క్రికెట్ అభిమానులు పెద్ద ఎత్తున రావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాటలో సుమారు 20 మంది గాయపడ్డారు. ఈ ఘటనలో గాయపడిన వారికి వైద్య చికిత్స కోసం అయ్యే ఖర్చులను హెచ్ సీ ఏ భరిస్తామని ప్రకటించింది.