మంచాలలో అర్దరాత్రి యువతీ, యువకుల హంగామా.. మద్యం తాగుతూ, స్విమ్మింగ్ చేస్తూ రచ్చ.. చివరకు పోలీసుల ఎంట్రీతో..

Published : Sep 28, 2022, 09:49 AM IST
మంచాలలో అర్దరాత్రి యువతీ, యువకుల హంగామా..  మద్యం తాగుతూ, స్విమ్మింగ్ చేస్తూ రచ్చ.. చివరకు పోలీసుల ఎంట్రీతో..

సారాంశం

రంగారెడ్డి జిల్లా మంచాలలో కాలేజ్ విద్యార్థులు హంగామా సృష్టించారు. అర్ధరాత్రి విల్లాలో మద్యం తాగుతూ చిందులు వేశారు. స్విమ్మింగ్ ‌పూల్‌లో ఎంజాయ్ చేస్తూ కేకలు వేయసాగారు. 

రంగారెడ్డి జిల్లా మంచాలలో కాలేజ్ విద్యార్థులు హంగామా సృష్టించారు. అర్ధరాత్రి విల్లాలో మద్యం తాగుతూ చిందులు వేశారు. స్విమ్మింగ్ ‌పూల్‌లో ఎంజాయ్ చేస్తూ కేకలు వేయసాగారు. చివరకు పోలీసులు ఎంట్రీ ఇస్తే గానీ విద్యార్థులు వెనక్కి తగ్గలేదు. వివరాలు.. మంచాల మండలం ఆరుట్ల గ్రామంలోని ఓ విల్లాలో ఓ యువకుడు బర్త్ డే పార్టీ జరిగింది. ఈ పార్టీకి 10 మందికి పైగా యువతీ, యువకులు హాజరయ్యారు. రాత్రి 3 గంటల వరకు మద్యం తాగుతూ చిందులు వేశారు. మద్యం మత్తులో స్విమ్మింగ్ పూల్‌లో ఎంజాయ్ చేస్తూ నానా రచ్చ చేశారు. 

పెద్దగా అరుస్తూ హంగామా చేశారు. అయితే చివరకు పోలీసులు అక్కడికి చేరుకుని విద్యార్థులకు వార్నింగ్ ఇచ్చారు. ఇదేనా పద్దతి అంటూ ప్రశ్నించారు. అనంతరం వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. అయితే ఈ విద్యార్థులంతా హైదరాబాద్‌లోని ఓ కాలేజ్‌కు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. 

అయితే అటవీ ప్రాంతంలో విల్లాలు కట్టి జల్సా రాయుళ్లకు రెంట్స్‌కు ఇస్తున్నారని.. ఇక్కడికి రాత్రి సమయంలో ఎవరూ వస్తున్నారో, వెళ్తున్నారో తెలియడం లేదని గ్రామస్థలు చెబుతున్నారు. ఇలాంటి ఘటనలు తరుచూ జరుగుతూనే ఉంటాయని గ్రామస్తులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

సంధ్య థియేటర్ కేసు విచారణకు వర్చువల్‌గా హాజరైన అల్లు అర్జున్ | Asianet News Telugu
Pawan Kalyan అంటే భయమా? | Janasena Leader Shankar Goud fire on Jagadeesh Reddy | Asianet News Telugu