నా కూతురిని చూడాలని ఉంది.. మనోహరచారి

Published : Oct 03, 2018, 09:50 AM IST
నా కూతురిని చూడాలని ఉంది.. మనోహరచారి

సారాంశం

మద్యం మత్తులో క్షణికావేశంతోనే ప్రేమ పెళ్లి చేసుకున్న కూతురు, అల్లుడిపై కత్తితో దాడి చేశానని,  ప్రసుత్తం కుమిలిపోతున్నట్లు మనోహరచారి పోలీసులకు వెల్లడించాడు.

ఒక్కసారి తన కూతురిని చూడాలని ఉందని మనోహరచారి పోలీసులను వేడుకుంటున్నాడు. టీవల ఎర్రగడ్డలో కన్న కూతురు మాధవి, అల్లుడు సందీప్‌పై కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ప్రస్తుతం ఆయనలో పశ్చాత్తాపం కనపడుతోందని పోలీసులు చెబుతున్నారు.

మద్యం మత్తులో క్షణికావేశంతోనే ప్రేమ పెళ్లి చేసుకున్న కూతురు, అల్లుడిపై కత్తితో దాడి చేశానని,  ప్రసుత్తం కుమిలిపోతున్నట్లు మనోహరచారి పోలీసులకు వెల్లడించాడు. ఆసుపత్రి పాలైన కూతుర్ని చూడాలని ఉందంటూ అతడు పోలీసులకు తెలిపినట్లు సమాచారం.

 ప్రేమ పెళ్లి చేసుకున్న తన కూతురు మాధవి, అల్లుడు సందీప్‌లపై గత నెల 19వ తేదీ సాయంత్రం నడి రోడ్డుపై మనోహరచారి కొబ్బరి బోండాల కత్తితో దాడి చేసిన సంఘటన సంచలనం సృష్టించింది. దాడి అనంతరం ఖైరతాబాద్‌ సమీపంలోని తన బావమరిది ఇంట్లో ఆశ్రయం పొందిన మనోహరచారిని పోలీసు అరెస్టు చేశారు. హత్యాయత్నం, ఎస్సీ, ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అతడిని రిమాండ్‌కు తరలించారు.

read more news

భార్యకు చివరి కాల్: అదే మనోహరాచారిని పట్టిచ్చింది

మాధవి కేసులో మందకృష్ణ మాదిగ అనుమానం ఏంటంటే

సైకోలా చేస్తాడనే పెళ్లి గురించి ముందే డాడీకీ చెప్పలేదు: మాధవి సోదరుడు

నా భార్యే కారణం, ఆమెనే చంపాల్సింది: మనోహారాచారి

ఇంకా మాధవి పరిస్థితి విషమంగానే: హెల్త్ బులెటిన్ విడుదల

'మూడు మర్డర్లు చేశాను... కానీ... మారుతీరావులా చేయను'

మాపై దాడికి ఆమె కారణం, మాధవికి బ్రెయిన్ వాష్ చేసేది: సందీప్ సంచలనం

తండ్రి దాడి: మాధవి పరిస్థితిపై ఇప్పుడే చెప్పలేమంటున్న డాక్టర్లు

ఎస్ఆర్ నగర్ దాడి: లొంగిపోయిన మనోహరాచారి, మాధవి పరిస్థితి విషమం

 

 కాగా ఈ కేసులో లోతైన విచారణ కోసం నిందితుడిని మూడు రోజుల పాటు ఎస్సార్‌నగర్‌ పోలీసులు కస్టడీకి తీసుకున్న విషయం తెలిసిందే. తన కూతురు కూలాంతర ప్రేమ పెళ్లి చేసుకోవడంతో బంధువులు సూటి, పోటి మాటలతో రెచ్చగొట్టారని, ఆ కసితోనే కసాయిలా మారి  కూతురిపై కత్తితో దాడి చేశానని విచారణలో మనోహరచారి వెల్లడించినట్లు తెలిసింది. 

ప్రేమ పెళ్లి చేసుకున్న తన కూతురిని ఎంత బతిమిలాడినా ఇంటికి రాలేదని, దీంతో తన కోపం మరింత పెరిగిందని వెల్లడించినట్లు సమాచారం. బంధువుల మాటలు, కూతురిపై కోపంతోనే ఆమెను చంపాలని నిర్ణయించుకున్నాని, అయితే సంఘటనా స్థలానికి అల్లుడు కూడా రావడంతో ఇద్దరిపై దాడి చేశానని తెలిపాడు. తాను చేసిన తప్పునకు చింతిస్తున్నానని, ఆసుపత్రిలో ఉన్న కూతుర్ని చూడాలని ఉన్నా.. తాను చేసిన నేరం కట్టిపడేసిందని వాపోయినట్లు విశ్వసనీయ సమాచారం.
 

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
Hyderabad: ఇది పూర్త‌యితే హైద‌రాబాద్‌లో దేశంలో టాప్ సిటీ కావ‌డం ఖాయం.. ORR చుట్టూ మెగా ప్రాజెక్ట్‌