కేసిఆర్ కు మరో షాక్: కాంగ్రెసులోకి మరో మాజీ ఎమ్మెల్యే

By pratap reddyFirst Published Oct 3, 2018, 8:13 AM IST
Highlights

ఏ పార్టీలో  చేరాలనే విషయంపైఅనుచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని అబ్బయ్య చెప్పారు. అయితే, ఆయన కాంగ్రెసులో చేరడానికి సిద్ధపడినట్లు చెబుతున్నారు.

ఇల్లెందు: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) సీనియర్ నేత, మాజీ శాసనసభ్యుడదు ఊకే అబ్బయ్య కాంగ్రెసులో చేరడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఇల్లెందు నియోజకవర్గం నుంచి రెండు సార్లు, బూర్గంపాడు నుంచి ఓసారి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. 

2014 ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్‌ లభించకపోవడంతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసి 20,807 ఓట్లతో తృతీయ స్థానంలో నిలిచారు. అయితే అప్పటి నుంచి అబ్బయ్య టీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతున్నారు. సోమవారం ఆయన టీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేశారు. 

ఏ పార్టీలో  చేరాలనే విషయంపైఅనుచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని అబ్బయ్య చెప్పారు. అయితే, ఆయన కాంగ్రెసులో చేరడానికి సిద్ధపడినట్లు చెబుతున్నారు. ఇల్లెందు నియోజకవర్గంలోని గార్ల మేజర్‌ గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్‌ గంగావత్‌ లక్ష్మణ్‌నాయక్‌ సైతం మంగళవారం టీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేశారు. 

గ్రామ పంచాయతీలో అభివృద్ధి కార్యక్రమాలకు స్థానిక టీఆర్‌ఎస్‌ నాయకులే అడ్డు తగులుతున్నారని ఆరోపిస్తూ తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. 

ఊకే అబ్బయ్య, గంగావత్‌ లక్ష్మణ్‌, ఇరువురు తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు చెబుతున్నారు.

click me!