చందానగర్ మర్డర్ కేసు : ఆరేళ్ల కూతురి కళ్లముందే.. భార్యను అతిదారుణంగా హత్య చేసిన భర్త.. కారణం ఏంటంటే...

By SumaBala Bukka  |  First Published Apr 15, 2023, 10:47 AM IST

శుక్రవారం హైదరాబాద్ చందానగర్ లో జరిగిన హత్య కేసులో మరో షాకింగ్ విషయం వెలుగు చూసింది. ఆరేళ్ల కూతురి కళ్లముందే భర్త, భార్యను అతి దారుణంగా హత్య చేశాడు. 


హైదరాబాద్ : నల్లగండ్లలోని ఓ బోటిక్‌లో శుక్రవారం ఉదయం హౌస్‌కీపింగ్ వర్కర్ (26)ను పనిచేస్తున్న చోటే ఆమె భర్త కత్తితో పొడిచి హత్య చేశాడు. తల్లితో కలిసి ఆమె పనిచేసే చోటికి వచ్చిన ఆ దంపతుల ఆరేళ్ల కుమార్తె కళ్ల ముందే ఈ హత్య జరిగింది. వ్యక్తిగత సమస్యల కారణంగా బాధితురాలు గత ఐదేళ్లుగా భర్తతో విడిగా ఉంటోంది. చందానగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మృతురాలిని అంబికగా గుర్తించారు. బోటిక్‌లో హౌస్‌కీపింగ్ స్టాఫ్-కమ్-సేల్స్ పర్సన్‌గా పనిచేస్తోంది. అదే సమయంలో డెంటల్ క్లినిక్, గిఫ్ట్ స్టోర్‌లో కూడా పనిచేస్తోంది. ఈ రెండు షాపులు ఒకే భవనంలో ఉన్నాయి.

అంబిక వికారాబాద్‌లోని అల్లాపూర్‌ గ్రామానికి చెందిన నరేందర్‌గౌడ్‌ను ఎనిమిదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వీరిద్దరూ గతంలో తాండూరులోని ఒకే పాఠశాలలో కలిసి చదువుకున్నారు. వివాహానంతరం ఈ జంట తాండూరులో కొంతకాలం నివసించారు. అయితే నరేందర్ మద్యానికి బానిసై కుటుంబాన్ని పోషించడం మానేయడంతో అంబిక నగరానికి వలస వచ్చేసింది. నిందితులు మద్యం మత్తులో అంబికను వేధించడం ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.

Latest Videos

హైద్రాబాద్ చందానగర్ లో దారుణం: రోడ్డుపై వెంటాడి భార్యను హత్య చేసిన భర్త

హైదరాబాద్‌కు వచ్చిన తరువాత ఓ వాణిజ్య సంస్థల్లో హౌస్ కీపింగ్ పనిలో కుదిరింది. కూతురితో కలిసి ఒంటరిగా ఉంటోంది. ఈ క్రమంలో నరేందర్ చాలాసార్లు ఆమెకు ఫోన్ చేసి తిరిగి రావాలని కోరినప్పటికీ ఆమె నిరాకరించింది. అతను కూడా వీరికి దగ్గరగా ఉండాలని.. మియాపూర్‌లోని మద్యం షాపులో పనికి కుదిరాడు. "అంబిక అతనితో ఉండడానికి నిరాకరించినందున, అతను పగతో ఉన్నాడు. అది ఆమెను చంపడానికి పథకం వేసేందుకు పురిగొల్పింది" అని చందానగర్ ఇన్స్పెక్టర్, కె కాస్ట్రో చెప్పారు.

శుక్రవారం ఉదయం 11.30 గంటలకు అంబిక తన కుమార్తెతో కలసి నల్లగండ్లలోని మూడంతస్తుల భవనంలో పై అంతస్తులో ఉన్న బోటిక్‌ను శుభ్రం చేసేందుకు వెళ్లగా, నరేందర్ ఆమెను వెంబడించాడు. ఆమె వెనకే బోటిక్‌లోకి ప్రవేశించి ఆమె తలపై రాయితో కొట్టాడు. అతని నుంచి తప్పించుకుని అంబిక డాబాపైకి వెళ్లేందుకు ప్రయత్నించినా విఫలమైంది.

"నిందితుడు తన జేబులోంచి కత్తి తీసి ఆమె మెడపై పొడిచాడు. ఆమె కారిడార్‌లో కుప్పకూలిపోయి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మరణించింది" అని ఇన్‌స్పెక్టర్ చెప్పారు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడు తప్పించుకునేందుకు ప్రయత్నించగా స్థానికుల సహకారంతో పట్టుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేశారు.

click me!