Hyderabad : వదినకు ఫుల్లుగా మందుకొట్టించి... మత్తులోకి జారుకోగానే మరిది దారుణం

By Arun Kumar P  |  First Published Aug 4, 2023, 11:30 AM IST

సొంత వదినతో కలిసి ఫుల్లుగా మద్యం సేవించిన ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. మత్తులోకి జారుకున్న వదినను అతి దారుణంగా హతమార్చాడు. 


హైదరాబాద్ : అన్నను చంపిన వదినపై పగతో రగిలిపోయాడు ఓ యువకుడు. ఇటీవలే జైలునుండి విడుదలైన వదినను మంచిమాటలతో నమ్మించి ఇంటికి పిలిచాడు. ఆమెతో కలిసి మద్యం సేవించి మత్తులోకి జారుకోగానే అతి దారుణంగా హతమార్చాడు. ఈ దారుణం హైదరాబాద్ లో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే... హైదరాబాద్ కుత్భుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని సూరారం విశ్వకర్మ కాలనీలో సురేష్, రేణుక దంపతులు ఇద్దరు కూతుళ్లతో కలిసి నివాసముండేవారు. ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్న వీరి సంసారం ఏనాడూ సాఫీగా సాగలేదు. భార్యాభర్తలిద్దరూ తాగుడుకు బానిసలే కావడంతో మత్తులో నిత్యం గొడవపడేవారు. దీంతో భర్తపై ద్వేషాన్ని పెంచుకున్న రేణుక దారుణానికి ఒడిగట్టింది. 

Latest Videos

కల్లు దుకాణంలో పరిచయమైన ఓ అనాధ యువతి సహకారంతో భర్త సురేష్ ను హతమార్చింది రేణుక. తర్వాత తన భర్తను ఎవరో చంపారంటూ నాటకమాడేందుకు ప్రయత్నించింది. కానీ ఈ ప్లాన్ బెడిసికొట్టి రేణుక కటకటాలపాలయ్యింది.

Read More  చిత్తూరులో దారుణం... బీర్ బాటిళ్లతో దాడిచేసి టమాటా రైతును దోచుకున్న దుండగులు

అయితే తన అన్నను చంపిన వదిన రేణుకపై కక్షగట్టాడు నరేష్. ఇటీవల బెయిల్ పై జైలునుండి బయటకు వచ్చిన వదినను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగానే రేణుకను తన ఇంటికి రావాలని నరేష్ పిలిచాడు. ఇలా మరిది ఇంటికి వెళ్లిన రేణుక మరో ముగ్గురితో కలిసి మద్యం సేవించింది. ఫుల్లుగా మందుకొట్టి మత్తులోకి జారుకున్న వదిన గొంతుకు చున్నీ బిగించి హతమార్చాడు నరేష్. అతడికి మిగతా ముగ్గురు సహకరించారు. 

ఉదయం రేణుక మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఆమె మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు. ఫోన్ కాల్స్ ఆధారంగా మరిది నరేష్ ఆమెను చంపినట్లుగా గుర్తించిన పోలీసులు అతడికోసం గాలిస్తున్నారు. 


 

click me!