బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్: బాధ్యతలు స్వీకరణ

By narsimha lode  |  First Published Aug 4, 2023, 11:14 AM IST

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్  ఇవాళ బాధ్యతలు చేపట్టారు.  బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా సంజయ్ ను ఆ పార్టీ తప్పించింది. జాతీయ ప్రధాన కార్యదర్శిగా  నియమించిన విషయం తెలిసిందే.
 


న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్ శుక్రవారం నాడు  బాధ్యతలు చేపట్టారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా  ఉన్న బండి సంజయ్ ను ఆ పార్టీ నాయకత్వం తప్పించింది. బండి సంజయ్ స్థానం లో  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది.  బండి సంజయ్ ను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించింది.  

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్  ఇవాళ బాధ్యతలు చేపట్టారు. బీజేపీ కేంద్ర కార్యాలయంలోని తన కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన  తర్వాత  ఆయన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతలను చేపట్టారు.

Latest Videos

ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో  కుటుంబసభ్యులతో  బండి సంజయ్  నిన్న భేటీ అయ్యారు. ఇవాళ  బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా  బాధ్యతలు చేపట్టారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టాలని బీజేపీ నాయకత్వం వ్యూహంతో ముందుకు వెళ్తుంది. ఈ  మేరకు  పార్టీలో సంస్థాగత మార్పులకు  శ్రీకారం చుట్టింది.  ఈ క్రమంలోనే  పలు రాష్ట్రాల అధ్యక్షులను మార్చింది.

తెలంగాణ, ఏపీ  సహా మరో రెండు రాష్ట్రాల అధ్యక్షులను బీజేపీ మార్చింది. ఈ ఏడాది జూలై మాసంలో  బీజేపీ  దక్షిణాది రాష్ట్రాల అధ్యక్షులతో  ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమావేశమయ్యారు. దక్షిణాదిలో  పార్టీ విస్తరణ, వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై  చర్చించారు. దక్షిణాదిలో  రానున్న ఎన్నికల్లో ఎక్కువ ఎంపీ సీట్లను దక్కించుకోవడంపై  ఆ పార్టీ నాయకత్వం కేంద్రీకరించింది. 

 

 


 

click me!