ఏసీ, గీజర్ మెకానిక్ తో వచ్చి, రహస్య కెమెరాలు... ఫొటోలు, వీడియోలు తీసి బ్లాక్ మెయిలింగ్...

By SumaBala BukkaFirst Published Dec 2, 2022, 7:29 AM IST
Highlights

వివాహిత ఇంట్లో రహస్య కెమెరాలు అమర్చి ఆమెను బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

హైదరాబాద్ : మహిళలపై రోజురోజుకు అత్యాచారాలు, దాడులు పెరిగిపోతున్నాయి. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో ఒక చోట బ్లాక్ మెయిలింగ్, లైంగిక వేధింపుల ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. హైదరాబాద్ లోని ఆల్వాల్ లో మొబైల్ షాపును నడిపే మహిళ తాజాగా ఇలాంటి వేధింపులకు గురయింది. ఆమె షాప్ కు  మొబైల్ కంపెనీ వీవో.. టీం లీడర్ గా పని చేస్తున్నా అంటూ గాజులరామారంకి చెందిన ఓ వ్యక్తి వచ్చాడు. సయ్యద్ రియాజ్ అనే అతను సెల్ ఫోన్ అమ్మకాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని చెబుతూ.. తరచుగా ఆమె దగ్గరికి వస్తుండేవాడు. ఈ క్రమంలోనే ఆ మహిళతో మాట్లాడేందుకు ప్రయత్నించేవాడు.

అలా ఓ సారి వచ్చినప్పుడు ఆ మహిళ తన భర్తతో ఫోన్ లో మాట్లాడుతోంది. ఇంట్లో ఏసీ,గీజర్ రిపేర్ గురించి చెబుతోంది. అదే సమయంలో అక్కడే ఉన్న రియాజ్ ఇదంతా విన్నాడు. తనకు ఓ మెకానిక్ తెలుసునని.. బాగా రిపేర్ చేస్తాడని.. అతనిని పంపిస్తానని..  ఆమెను ఒప్పించాడు. మరుసటి రోజు రియాజ్ మెకానిక్ తో ఆ మహిళ ఇంటికి వెళ్ళాడు. రిపేరు చేస్తున్న క్రమంలో ఆమెకు తెలియకుండా ఇంట్లో అక్కడక్కడా రహస్య కెమెరాలను అమర్చాడు. ఆ తరువాత వీటి సహాయంతో.. ఆమె ఫోటోలు, వీడియోలు తీశాడు. ఆ తర్వాత..  అవి తన దగ్గర ఉన్నాయి అంటూ చెబుతూ ఆమెను బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. 

మూడో తరగతి బాలికతో హెచ్ఎం అసభ్య ప్రవర్తన.. దేహశుద్ధి..

తాను చెప్పినట్టు చేయాలని లేకపోతే.. తన దగ్గర ఉన్న ఆమె ఫోటోలను, వీడియోలోని అశ్లీల దృశ్యాలను ప్రింట్లు తీసి ఆమె ఇంటి చుట్టుపక్కల గోడల మీద అంటిస్తానని బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. దానికి ఆ మహిళలు లొంగకపోవడంతో..  తెగించాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో  మహిళ ఒంటరిగా ఉండటం చూసి  ..ఇంట్లోకి జొరబడ్డాడు. దీంతో మహిళ భయపడిపోయింది. గట్టిగా కేకలు వేసింది. ఆమె కేకలతో నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. వెంటనే విషయాన్ని ఆమె భర్తకు తెలిపింది. పేట్ బషీరాబాద్ షీ టీమ్స్ కు ఫిర్యాదు చేసింది. షీ టీమ్స్ సలహాతో ఆల్వాల్ పీఎస్లో ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు కేసు నమోదు చేశారు. వెంటనే పోలీసులు నిందితుడిని గాలించి అదుపులోకి తీసుకున్నారు. 

హైద్రాబాద్‌ నాగోల్ జ్యుయలరీ షాపులో కాల్పులు, ఇద్దరికి గాయాలు: బంగారం చోరీ

ఇలాంటి కేసులు ప్రతీరోజూ ఎన్నో తమ దగ్గరికి వస్తున్నాయని షీ టీమ్స్ చెబుతోంది. పార్క్ లో మహిళ వాకింగ్ చేస్తుంటే ప్లాష్ లైట్లు కొట్టి వేధిస్తున్న అకతాయిలు, లిఫ్ట్ లో వెడుతుంటే  మైనర్ బాలిక మీద అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని, పెళ్లి పేరుతో మోసం చేసి గర్భతిని చేసి పారిపోయిన లాంటి ఘటనల్లో నిందితులకు షీ టీమ్స్ చెక్ పెట్టిందని చెప్పుకొచ్చారు. ఇలాంటి కేసులకు సంబంధించి గత నెలలో సైబరాబాద్ షీ టీమ్స్ కు 98 ఫిర్యాదులు వచ్చాయి. వీటిల్లో 29 కేసులు నమోదయ్యాయి. 
 

click me!