హైద్రాబాద్‌ నాగోల్ జ్యుయలరీ షాపులో కాల్పులు, ఇద్దరికి గాయాలు: బంగారం చోరీ

By narsimha lodeFirst Published Dec 1, 2022, 9:46 PM IST
Highlights

హైద్రాబాద్ నాగోల్ లో  కాల్పులకు దిగిన దుండగులు  బంగారాన్ని దోచుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

హైదరాబాద్: నగరంలోని నాగోల్‌లో  కాల్పులు జరిపిన  దుండగులు  బంగారాన్ని దోచుకున్నారు.  నాగోల్  స్నేహపురి కాలనీలోని  బంగారం షాపులో  ఇద్దరు దుండగులు తుపాకులతో  బెదిరించి  బంగారాన్ని దోచుకున్నారు. బంగారం  షాపులో ఉన్నవారిని బెదిరించేందుకు దుండగులు మూడు రౌండ్ల కాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో ఇద్దరు గాయపడ్డారు. .ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనస్థలానికి చేరుకున్నారు.  సీసీటీవీ పుటేజీని పరిశీలిస్తున్నారు. సీసీటీవీ పుటేజీ ఆధారగా నిందితులను గుర్తించేందుకు  పోలీసులు ప్రయత్నిస్తున్నారు. 

జ్యుయలర్స్ షాపులోకి  సికింద్రాబాద్  నుండి హోల్ సేల్  దుకాణం  నుండి  బంగారం  తీసుకువచ్చారు. అక్కడి  నుండి నిందితులు ఫాలో  అయ్యారని పోలీసులు అనుమానిస్తున్నారు. హోల్  సేల్  బంగారం షాపు నుండి తీసుకువచ్చిన బంగారం  బ్యాగ్ ను దుండగులు  లాక్కెళ్లారని  పోలీసులు గుర్తించారు. 

స్నేహపురి కాలనీలోని మహదేవ్  జ్యుయలర్స్ లో  దుండగులు కాల్పులకు దిగి బంగారాన్ని చోరీ చేశారు.  ఇవాళ రాత్రి మహదేవ్  జ్యుయలర్స్  షాపును మూసివేసే సమయంలో ఇద్దరు దుండగులు వచ్చారు. బంగారు ఆభరణాలు కావాలని కోరారు.  దీంతో  బంగారం  షాప్  యజమాని,షాపులో  పనిచేసే వ్యక్తి దుండగులకు  బంగారు ఆభరణాలు  చూపే ప్రయత్నిస్తున్నారు. అయితే  అదే  సమయంలో దుండగులు  దుకాణం  షట్టర్  మూసివేశారు.  దుకాణంలో  ఉన్న  బంగారాన్ని  తమకు ఇవ్వాలని డిమాండ్  చేశారు. దీంతో  షాపు యజమానితో  పాటు  షాపులో పనిచేసే వ్యక్తి దుండగులను అడ్డుకునే ప్రయత్నం  చేశారు.ఈ సమయంలో  దుండగులు  కాల్పులకు దిగారు.ఈ కాల్పుల్లో  షాపు యజమాని  కళ్యాణ్ తో పాటు షాపులో  పనిచేసే యువకుడు కూడా గాయపడ్డారు. అనంతరం దుండగులు  షాపులోని బంగారాన్ని దోచుకెళ్లారు.  కాల్పుల శబ్దం  విన్న స్థానికులు షట్టర్ ను ఓపెన్  చేశారు. దుండగులు స్తానికులను తోసుకుంటూ  వెళ్లిపోయారు. పక్కనే సందులో పార్క్ చేసిన బైక్ ను  తీసుకొని పారిపోయారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దుండగులు దోచుకున్న బంగారం విలువ సుమారు  రూ. 25 లక్షలుగా ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు. నిందితులను పట్టుకొనేందుకు పోలీసులు నాలుగు బృందాలను ఏర్పాటు చేశారు.  
 

click me!