భార్య గొంతుకోసి చంపి.. తలతో పోలీస్ స్టేషన్ కు...ఓ భర్త ఘాతుకం...

Published : Dec 10, 2021, 02:55 PM IST
భార్య గొంతుకోసి చంపి.. తలతో పోలీస్ స్టేషన్ కు...ఓ భర్త ఘాతుకం...

సారాంశం

తల్లిదండ్రులు, బంధువులు నచ్చజెప్పి గతేడాది మళ్లీ పెళ్లి చేశారు. అయితే ఫర్వేజ్ ఏమీ మారలేదు. భార్యపై అనుమానంతో వేధించసాగాడు. ఈ క్రమంలోనే భార్యపై అనుమానంతో ఆమె నిద్రపోతున్న సమయంలో అదును చూసి.. ఆమెను murder చేసినట్లు స్థానికులు తెలిపారు. గంజాయి మత్తులో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. 

హైదరాబాద్ :  నగరంలో దారుణం జరిగింది. రాజేంద్రనగర్ పరిధిలోని ఇమాద్ నగర్ లో ఓ వ్యక్తి భార్యను కిరాతకంగా హత్య చేశాడు. నిద్రిస్తున్న భార్య గొంతు కోసి చంపేశాడు. ఆ తర్వాత భార్య తల తీసుకుని పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. వివరాల్లోకి వెళితే 14 ఏళ్ల క్రితం ఫర్వేజ్ తో samreen బేగంకు వివాహం జరిగింది. భర్త వేధింపులు తాళలేక సమ్రీన్ గతంలో విడాకులు తీసుకుంది. 

అయితే  ఆ తర్వాత తల్లిదండ్రులు, బంధువులు నచ్చజెప్పి గతేడాది మళ్లీ పెళ్లి చేశారు. అయితే ఫర్వేజ్ ఏమీ మారలేదు. భార్యపై అనుమానంతో వేధించసాగాడు. ఈ క్రమంలోనే భార్యపై అనుమానంతో ఆమె నిద్రపోతున్న సమయంలో అదును చూసి.. ఆమెను murder చేసినట్లు స్థానికులు తెలిపారు. గంజాయి మత్తులో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. 

ఇదిలా ఉండగా, డిసెంబర్ 6న మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఇలాంటి దారుణ ఘటనే చోటుచేసుకుంది. కూతురు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని.. కొడుకుతో కలిసి దారుణంగా హత్యచేసింది తల్లి.. నిండు గ‌ర్భిణి అనే క‌నిక‌రం లేకుండా విక్ష‌ణ‌రహితంగా దాడి చేసి.. తలను మొండాన్ని వేరు చేశారు కసాయి తల్లీకొడుకులు. అంత‌తో ఆగ‌కుండా.. తలను చేతిలో పట్టుకుని తిరుగుతూ సెల్ఫీలు దిగారు. వికృత చేష్టలు చేస్తూ.. స్థానికులను భ‌యాభంత్రుల‌కు గురిచేశారు. 

ప్రేమ వివాహం చేసుకుందని దారుణం .. అక్క తల నరికి సెల్ఫీ దిగిన త‌మ్ముడు

అనంత‌రం స‌మీపంలోని పోలీస్ స్టేష‌న్ కు వెళ్లి లొంగిపోయారు ఆ తల్లీ కొడుకులిద్దరూ.. ప్రస్తుతం ఈ సంఘటన ఔరంగాబాద్ జిల్లాలో సంచలనం సృష్టిస్తోంది. వివరాల్లోకెళ్తే..  ఔరంగాబాద్ కు చెందిన కీర్తిథోర్‌ (19) అనే యువ‌తి ఈ ఏడాది జూన్‌లో తాన‌ని ప్రేమించిన యువకుడితో ఇంట్లోంచి వెళ్ళిపోయి గుడిలో పెండ్లి చేసుకుంది. ఈ పెళ్లి ఆమె కుటుంబ సభ్యులకు ఏ మాత్రం ఇష్టం లేదు. తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకుంద‌ని కూతురు పై కక్ష పెంచుకుంది. 

ఎలాగైనా హ‌త‌మెందించాలని ప్లాన్ వేసింది తల్లి శోభా సంజయ్ మోతే. ఈ నేపథ్యంలోనే  ఆమె ఇంటికి వెళ్లింది పుట్టింటికి వచ్చి వెళ్లమని కోరింది. తీసుక‌పోవ‌డానికి వచ్చే వారం తమ్ముడు సంకేత్ సంజయ్ మోతే తో వ‌స్తాన‌ని చెప్పి వెళ్ళిపోయింది. చెప్పిన విధంగానే ఆదివారం మరోసారి తన కొడుకు సంకేత్ ని తీసుకుని కూతురింటికి వచ్చింది త‌ల్లి శోభ‌. తల్లిని, సోదరుడిని చూసి కాళ్లకు నీళ్లిచ్చి వంటగదిలోకి వెళ్లి టీ పెడుతుండగా.. తనతో మాటలు కలిపారు. 

అదే అదునుగా భావించిన ఆ కసాయి తల్లీకొడుకులు.. త‌మ వెంట తెచ్చుకున్న వేట కొవ‌లితో వెనక వైపు నుంచి కీర్తిథోర్ తలను వేటు వేశారు. కీర్తిథోర్ అర్థ‌నాదాలు విన్నా.. భ‌ర్త ప‌రుగుప‌రుగున వ‌చ్చి వారిని అడ్డుకునే ప్ర‌య‌త్నం చేయ‌గా.. అతనిని కూడా చంపేందుకు ప్రయత్నించారు.  పరువు హత్యతో ఔరంగాబాద్ జిల్లా ఉలిక్కిపడింది. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు తల్లీకొడుకులిద్దరినీ అదుపులోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?