కేంద్రంపై కేటీఆర్ ఫైర్.. పవర్ లూం క్లస్టర్ అతీగతి లేదంటూ చురకలు

Siva Kodati |  
Published : Dec 10, 2021, 02:43 PM IST
కేంద్రంపై కేటీఆర్ ఫైర్.. పవర్ లూం క్లస్టర్ అతీగతి లేదంటూ చురకలు

సారాంశం

రాష్ట్ర ఏర్పాటు తర్వాత చేనేత (chenetha), మరమగ్గాల కార్మికుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేశామన్నారు మంత్రి కేటీఆర్ (ktr) . కార్మికుల జీవన విధానం గతం కంటే మెరుగ్గా ఉందని మంత్రి తెలిపారు.

రాష్ట్ర ఏర్పాటు తర్వాత చేనేత (chenetha), మరమగ్గాల కార్మికుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేశామన్నారు మంత్రి కేటీఆర్ (ktr) . కార్మికుల జీవన విధానం గతం కంటే మెరుగ్గా ఉందని మంత్రి తెలిపారు. 2016-17 నుండి చేనేత చేయూత, రుణ మాఫీ, మరమగ్గాల ఆధునీకరణ, ప్రభుత్వం నుండి నేరుగా ఆర్డర్లు ఇచ్చి ఆదుకుంటున్నామని.. బతుకమ్మ చీరలు, విద్యార్థుల కోసం యూనిఫాం, ఎన్నో ప్రభుత్వ పరమైన ఆర్డర్లు అని కేటీఆర్ చెప్పారు. రూ. 1134 కోట్ల రాష్ట్రంలోని కార్మికులకు ఉపాధి కల్పించామని.. కార్మికుడిని యజమానిని చేసే విధంగా వర్కర్ టూ ఓనర్ పథకం ప్రవేశపెట్టుకున్నామని మంత్రి గుర్తుచేశారు.
 
గత ఏడున్నరేళ్లలో నేత కార్మికుల కోసం రాష్ట్ర మంత్రిగా కేంద్ర ప్రభుత్వానికి ఎన్నో వినతులిచ్చామని కేటీఆర్ దుయ్యబట్టారు. రాష్ట్రంలో నేత కార్మికుల కోసం ఇండియన్ ఇనిస్టిట్యూట్ హ్యాండ్ లూం కోసం విజ్ఞప్తి చేశామని.. జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమాలు, 26 బ్లాక్ లెవల్ క్లస్టర్ ఏర్పాటు కోసం వినతుస్తే చేసింది నామమాత్రమేనని మంత్రి తెలిపారు. తెలంగాణ నుండి నైపుణ్యం ఉన్న కళాకారుల కోసం వరంగల్‌లో పార్కు కోసం 600 ఎకరాల స్థలం కేటాయించామని కేటీఆర్ గుర్తుచేశారు. 

ALso Read:Karimnagar MLC Election 2021: 986 కు ఒక్క ఓటు టీఆర్ఎస్ తగ్గినా... ఈటలకు మంత్రి గంగుల సవాల్ (వీడియో)

దుస్తుల రంగంలో (textile industry)ముందుకు వెళ్లే విధంగా కేంద్రం తన వంతు బాధ్యత వహించాలని.. పోచంపల్లి, గద్వాల్‌లో నారాయణ పేట, దుబ్బాకలో పవర్ లూం క్లస్టర్ లను మంజూరు చేయాలని కోరినట్లు మంత్రి వెల్లడించారు. కేంద్ర చేనేత జౌళి శాఖ, ఆర్థిక మంత్రులకు వినతులిచ్చినా స్పందన లేదని కేటీఆర్ పేర్కొన్నారు. క్లస్టర్ ఏర్పడితే ఎంతో అభివృద్ధి ఉంటుందన్నారు. ఏడున్నరేళ్లుగా తెలంగాణ కోసం అడుగుతున్నా ఫలితం లేదన్నారు. 

సవతి తల్లి ప్రేమ చూస్తే ఊరుకోమని.. రాబోయే కేంద్ర బడ్జెట్లో క్లస్టర్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్ లూం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నామని కేటీఆర్ వెల్లడించారు. బిజెపి రాష్ట్ర నాయకత్వం కూడా స్పందించాలని.. తెలంగాణ అభివృద్ధి కోసం కలిసి రావాలన్నారు. కార్మికుల కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో చేస్తుందని.. కేంద్రం కూడా సహకరించాలని ఆయన డిమాండ్ చేశారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Hyderabad: మ‌రో హైటెక్ సిటీ రాబోతోంది.. డేటా సెంట‌ర్ల‌తో HYDలోని ఈ ప్రాంతం పూర్తిగా మార‌నుంది
Telangana : తొలివిడత పంచాయతీ పోలింగ్ షురూ.. ఈ ఎన్నికలకే ఇంత ఖర్చా..!