విడాకులు ఇచ్చినా మోజు తగ్గలేదు.. మాజీ భార్య వెంటపడి, వేధించి.. చివరికి..

Published : Jan 19, 2022, 10:21 AM IST
విడాకులు ఇచ్చినా మోజు తగ్గలేదు.. మాజీ భార్య వెంటపడి, వేధించి.. చివరికి..

సారాంశం

అక్బర్,  హబీబా  తొమ్మిదేళ్ల క్రితం love marriage చేసుకున్నారు. అయితే, హబీబా కంటే ముందే అక్బర్ అనీజా ఫాతిమా  అనే యువతిని వివాహం చేసుకున్నాడు. ఈ విషయం పెళ్లి చేసుకున్న తరువాతే హబీబాకు తెలిసింది. అయినా, కొంతకాలం  అక్బర్, హబీబాలు కలిసి కాపురం చేశారు. ఆ తరువాతే వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు కూడా తీసుకున్నారు.


హైదరాబాద్ :  Divorce తీసుకొని వేరుగా ఉంటున్నా..  ex-wife పై మోజు తగ్గలేదు. వెంటపడుతూ.. వేధిస్తుండటంతో గతంలో ఒకసారి jailకు కూడా వెళ్ళాడు. అయినా అతని బుద్ధి మారలేదు. మరోసారి మాజీ భార్యపై attackచేసి మళ్లీ జైలుకు వెళ్ళాడు. చందూలాల్ బారాదరి కి చెందిన  ఎండి అక్బర్ అనే వ్యక్తి అందరూ చూస్తుండగా మాజీ భార్య పై దాడికి పాల్పడిన సంఘటన నారాయణగూడ Police Station పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే..  అక్బర్,  హబీబా  తొమ్మిదేళ్ల క్రితం love marriage చేసుకున్నారు. అయితే, హబీబా కంటే ముందే అక్బర్ అనీజా ఫాతిమా  అనే యువతిని వివాహం చేసుకున్నాడు. ఈ విషయం పెళ్లి చేసుకున్న తరువాతే హబీబాకు తెలిసింది. అయినా, కొంతకాలం  అక్బర్, హబీబాలు కలిసి కాపురం చేశారు. ఆ తరువాతే వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు కూడా తీసుకున్నారు. అయితే, విడాకులు ఇచ్చినా..  హబీబా మీద మోజు తగ్గక అక్బర్ తరచుగా ఆమె వెంటపడేవాడు. ఆమె ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తే వెంబడించే వాడు. 

గతంలో రామ్ గోపాల్ పేట పీఎస్ పరిధిలో ఒకసారి హబీబాపై దాడి చేయగా రెండు రోజులపాటు జైలుకు కూడా వెళ్ళి వచ్చాడు. కాగా, కొద్దిరోజులుగా ఆ కేసును వాపసు తీసుకోవాలని హబీబా వెంటపడుతున్నాడు. మంగళవారం హబీబా తనకు కాబోయే భర్తతో హిమాయత్నగర్లోని ఓ పిజ్జా హట్ కు వచ్చింది. ఆమెను ఫాలో అవుతూ అక్కడికి వచ్చిన అక్బర్.. తన మొదటి భార్య అనీజా ఫాతిమాతో హబీబా వీడియోలు తీయించాడు.

ఇది గమనించిన హబీబా.. తన వీడియో ఎందుకు తీస్తున్నారు అని గద్దించింది. దీంతో అక్బర్ కోపానికి వచ్చాడు. అందరూ చూస్తుండగానే ఆమెపై దాడికి దిగాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు అడ్మిన్ ఎస్ఐ సంధ్య తెలిపారు.

ఇదిలా ఉండగా,  మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని చిన్న చింతకుంట మండలం మద్దూరు గ్రామానికి చెందిన భార్గవికి అదే గ్రామానికి చెందిన వెంకటేష్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ తరువాత ఇద్దరు సమీప బంధువులే అని తెలిసింది. వారి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. 

అందుకు ఇరు కుటుంబంలోని పెద్దలు ఒప్పుకోకపోవడంతో.. ఈ నెల 13న పెద్దలను ఎదిరించి వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అయితే భార్గవి తండ్రికి ఈ పెళ్లి బాగా కోపాన్ని తెప్పించింది. తన మాట కాదని పెళ్లి చేసుకుంది.. కాబట్టి తన కూతురు తనకు చచ్చిపోయిందని నిర్ణయించుకున్నాడు.

అంటితో ఆగకుండా.. కూతురుతో తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పాడు. తన కూతురు చనిపోయింది అంటూ గుండు గీయించుకున్నాడు. ఆమెకు  కర్మకాండలు కూడా జరిపించాడు. కూతురు చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. కీ.శే. కమ్మరి భార్గవి.. జననం.. మరణం అంటూ.. పెళ్లి చేసుకున్న తేదీని వేసి మరీ నివాళులు అర్పించాడు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

KCR Press Meet from Telangana Bhavan: చంద్రబాబు పై కేసీఆర్ సెటైర్లు | Asianet News Telugu
KCR Press Meet: ఇప్పటి వరకు ఒక లెక్క రేపటి నుంచి మరో లెక్క: కేసీఆర్| Asianet News Telugu