
హైదరాబాద్:తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ బదిలీ చేశారు. కేంద్ర కార్మిక శాఖ అదనపు కార్యదర్శిగా Shashank goyal ను బదిలీ చేశారు.1990 బ్యాచ్ కు చెందిన శశాంక్ గోయల్ 2020 మే 6వ తేదీన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయనను మంగళవారం నాడు రాత్రి కేంద్ర సర్వీసులకు బదిలీ చేస్తూ DOPT ఉత్తర్వులు జారీ చేసింది.
నవీన్ మిట్టల్, అధర్ సిన్హా, శశాంక్ గోయల్‌లను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి పదవీ కోసం ఈసీకి పంపితే శశాంక్ గోయల్ ను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా నియమించారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా బాధ్యతలు స్వీకరించడానికి ముందు శశాంక్ గోయల్ తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశారు.శశాంక్ గోయల్ కంటే ముందు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా రజత్ కుమార్ పనిచేశారు. Rajat Kumar ప్రస్తుతం తెలంగాణ నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు.. రజత్ కుమార్ కంటే ముందుగా రెండు రాష్ట్రాలకు Bhanwar lal రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా పనిచేశారు.
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా ఎవరిని నియమిస్తారో త్వరలోనే తేలనుంది. ఐఎఎస్ అధికారుల పేర్లను ఈసీకి సూచించనున్నారు. ముగ్గురు పేర్లలో ఈసీ ఒకరిని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా నియమించనుంది.