వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో కరోనా కలకలం.. భారీగా కేసులు.. ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు పాజిటివ్‌గా నిర్దారణ

By Sumanth KanukulaFirst Published Jan 19, 2022, 9:42 AM IST
Highlights

తెలంగాణలో కరోనా కలకలం రేపుతోంది. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో రోజువారి కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది. రాష్ట్రంలోని వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీసులు.. పెద్ద ఎత్తున కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. వరంగల్‌లోని ఎంజీఎం‌ ఆస్పత్రిలో(warangal mgm hospital) భారీగా కేసులు నమోదవుతున్నాయి. 

తెలంగాణలో కరోనా కలకలం రేపుతోంది. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో రోజువారి కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది. రాష్ట్రంలోని వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీసులు.. పెద్ద ఎత్తున కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. వరంగల్‌లోని ఎంజీఎం‌ ఆస్పత్రిలో(warangal mgm hospital) భారీగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ రావు కరోనా సోకింది. ఆస్పత్రిలోని ఇప్పటివరకు వైద్యులు, సిబ్బందికి కలిపి మొత్తం 72 కేసులు నమోదయ్యాయి. వీరిలో 12 మంది ప్రొఫెసర్లు, 14 మంది హౌస్ సర్జన్లు, 31 మంది వైద్య విద్యార్థులకు కోవిడ్ పాజటివ్‌గా తేలింది.  కాకతీయ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ డా మోహన్‌దాస్‌కు కూడా కోవిడ్ పాజిటివ్‌గా నిర్దారణ అయింది. 

ఎంజీఎంలో భారీగా కరోనా కేసులు నమోదవుతుండటంతో.. ఇతర సిబ్బంది, వైద్యులు కూడా కరోనా పరీక్షలు చేయించుకుంటున్నారు. వీరిలో ప‌లువురి (Coronavirus) రిపోర్టులు రావాల్సి ఉంది. ఆరోగ్య సిబ్బంది క‌రోనా బారిన‌ప‌డ‌టంతో ఎంజీఎంకు  వైద్యం కోసం వచ్చే  రోగుల‌లో ఆందోళ‌న‌లో వ్య‌క్త‌మ‌వుతున్న‌ది. పేషెంట్లతో పాటు మిగతా వైద్య సిబ్బందిలో భయాందోళనలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే ప్రాంతీయ కంటి వైద్య కళాశాలలో నలుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. వారిలో ఇద్దరు ఫార్మాసిస్ట్‌లు, ఇద్దరు నర్సులు ఉన్నారు. మరోవైపు సీకేఎం ప్రసూతి వైద్యశాలలో 19 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. 

మరోవైపు.. హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో కూడా భారీగా Covid-19 కేసులు భారీగా నమోదవుతున్నాయి.  గాంధీ ఆస్పత్రిలో విధులు నిర్వర్తించే 120 మంది వైద్య సిబ్బంది క‌రోనా వైర‌స్ (Coronavirus) మ‌హ‌మ్మారి బారిన‌ప‌డ్డారు.  అలాగే, ఉస్మానియా జ‌న‌ర‌ల్ ఆస్ప‌త్రిలో లోనూ 159మందికి ఆరోగ్య సిబ్బంది కోవిడ్‌-19 బారిన‌ప‌డ్డారు. అలాగే, ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రిలో కూడా 66 మందికి క‌రోనా వైర‌స్ సోకింది. వీరిలో 57 మంది పెషేంట్లు ఉండగా.. 9 మంది వైద్య సిబ్బంది ఉన్నారు.

తెలంగాణలో కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తుంది. గడిచిన 24 గంటల్లో 1,07,904 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 2,983 పాజిటివ్‌ కేసులు వెలుగుచూసినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం ప్రకటించింది. వీటితో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు కోవిడ్ బారినపడిన వారి సంఖ్య 7,14,639కి చేరింది. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కరోనాతో ఇద్దరు (corona deaths in telangana) మరణించారు. దీంతో తెలంగాణలో  ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 4,062కి చేరింది. వైరస్ బారి నుంచి నిన్న 2,706 మంది కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 22,472 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా ఇవాళ 1206 కేసులు నమోదయ్యాయి.  

click me!