Amnesia Pub Rape Case : వీడియోలు వైరల్ చేసిన వ్యక్తి అరెస్ట్.. బిజెపి నేత రఘునందన్ రావుపై కేసు??

By SumaBala Bukka  |  First Published Jun 6, 2022, 12:28 PM IST

అమ్నేషియా పబ్ రేప్ ఘటనలో మరొకరు అరెస్టయ్యారు. వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.


హైదరాబాద్ : జూబ్లీహిల్స్లో బాలికపై సామూహిక అత్యాచారం కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. రోజుకో మలుపు, పూటకో కొత్త కోణం బయటపడుతున్నాయి. ఇప్పటికే ఈ కేసులో నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనకు సంబంధించి బాలిక వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేసిన పాతబస్తీ వాసి సుభాన్ ను అరెస్టు చేశారు. కాగా ఈ కేసుకు సంబంధించిన వీడియోలను బహిర్గతం చేసిన బిజెపి శాసనసభ్యుడు రఘునందన్ రావుపై కేసు పోలీసులు కేసు నమోదు చేయనున్నట్లు సమాచారం. 

అసలు ఆ రోజు ఏం జరిగిందంటే… 
ఒక ఇంటర్నేషనల్ పాఠశాల పేరుతో మద్యరహిత వేడుకకు అనుమతి తీసుకున్న ప్లస్ వన్, ప్లస్ టు విద్యార్థులు వారి స్నేహితులు పబ్ కు వచ్చారు. 152 మందికి అనుమతి ఉండగా 182 మంది హాజరైనట్లు సమాచారం. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5:30 వరకువారు అక్కడే ఉన్నారు. కార్పొరేటర్ కుమారుడు (16) బాధిత బాలికతో మాట కలిపాడు. గతంలో ఒకసారి కలిశామంటూ కథలు చెప్పి నమ్మించాడు. తన స్నేహితులను పరిచయం చేశాడు. వేడుక ముగిశాక బాలికతో కలిసి ఇన్నోవా కారులో బయలుదేరారు. ఎమ్మెల్యే సోదరుడి కుమారుడు ఉమేర్ ఖాన్ బెంజ్ కారు నడుపుతుండగా ఎమ్మెల్యే కుమారుడు, కార్పొరేటర్ కుమారుడు, ఇతర స్నేహితులు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. 

Latest Videos

undefined

వారు ఆమెను ముద్దులు పెట్టడం, దగ్గరికి తీసుకునే దృశ్యాలు సామాజిక మాధ్యమాల ద్వారా బయటికి వచ్చాయి. ఆమెని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14 లోని కాన్సు బేకరీకి తీసుకెళ్లి ఇన్నోవాలోకి ఎక్కించుకున్నాక నిందితులు సుమారు 50 నిమిషాలపాటు బంజారా హిల్స్, జూబ్లీహిల్స్ మార్గాల్లో చక్కర్లు కొడుతూ అఘాయిత్యానికి పాల్పడ్డారు. తర్వాత.. బాలికను పబ్ వద్ద వదిలేసిన నిందితులు.. అదే బేకరీ వద్ద ఫోటోలు దిగారు. పార్టీ ముగిసిందని ఇంస్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు.  

కార్పొరేటర్ కుమారుడు, ఎమ్మెల్యే కుమారుడు, ప్రభుత్వ సంస్థ చైర్మన్ తనయుడు ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. పబ్ నుంచి బేకరీ వెళ్లి సమయంలో  బెంజ్ కారును నడిపింది ఉమేర్ ఖాన్ గా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. కార్పొరేటర్ కుమారుడు, ఎమ్మెల్యే తనయుడు బాలికతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న వీడియో ఆధారాలను పోలీసులు సేకరించినట్లు సమాచారం.

ఇప్పటికే సాదుద్దీన్ మాలిక్ (18)తో పాటు మరో ఇద్దరు బాలురను అరెస్టు చేసిన పోలీసులు శనివారం రాత్రి గుల్బర్గా ప్రాంతంలో మరో బాలుడిని అరెస్టు చేశారు. కీలక నిందితుడు ఉమేర్ ఖాన్(18)ను  పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వదంతులు వస్తున్నా, అతడు పరారీలో ఉన్నట్టు చెబుతున్నారు. నిందితుల నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు కస్టడీ పిటిషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. 

ఇదిలా ఉంటే, హైదరాబాదులోని అమ్నీషియా పబ్ నుంచి బాలికను కొందరు వ్యక్తులు కారులో తీసుకువెళ్లి సామూహిక అత్యాచారం జరిగిన ఘటనలో టెక్నికల్ ఎవిడెన్స్ కీలకంగా మారనున్నాయి. ఈ కేసులో ఐదుగురు నిందితులను గుర్తించిన పోలీసులు ఇప్పటికే నలుగురిని అరెస్టు చేశారు. అయితే ఈ కేసులో నిందితులుగా ఉన్నవారు సంపన్న, రాజకీయ కుటుంబాలకు చెందిన వారు కావడంతో.. తీవ్ర సంచలనంగా మారింది. నిందితులను తీవ్రంగా శిక్షించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించి పోలీసుల తీరుపై కూడా విమర్శలు చేస్తున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో శనివారం పోలీసులు బాలికపై అత్యాచారం జరిపిన ఇన్నోవా కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం ఈ కేసులో కీలకంగా ఉన్న బెంజ్, ఇన్నోవా కార్ల నుంచి  ఫోరెన్సిక్ బృందాలు ఆధారాలు సేకరించాయి. ఇన్నోవాలో బాలిక చెవి కమ్మలు, వేలిముద్రలు, తల వెంట్రుకలు, చెప్పులు ఫోరెన్సిక్ నిపుణులు సేకరించినట్టు గా సమాచారం.  అంతే కాకుండా వీర్య నమూనాలు, సీట్లపై ఏర్పడ్డ మరకల నమూనాలు కూడా లభించినట్లు గా తెలుస్తుంది. మరోవైపు  బెంజ్ కారులో చెప్పులు,  మార్కులు, ఇతర వస్తువులను ఫోరెన్సిక్ నిపుణులు సేకరించినట్లు సమాచారం.

click me!