మల్లు భట్టి, శ్రీధర్ బాబు భేటీ: పార్టీ మార్పుపై గండ్ర స్పందన ఇదీ...

By telugu teamFirst Published Apr 21, 2019, 7:35 PM IST
Highlights

టీఆర్ఎస్ లోకి వస్తే గండ్ర వెంకటరమణా రెడ్డి సతీమణికి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవి ఇస్తామని కూడా టీఆర్ఎస్ నాయకత్వం ఆఫర్ ఇచ్చినట్లు చెబుతున్నారు. గండ్రతో పాటు సంగారెడ్డి శాసనసభ్యుడు తూర్పు జయప్రకాశ్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే పోడెం వీరయ్య టీఆర్ఎస్ లో చేరుతారని వార్తలు వచ్చాయి.

హైదరాబాద్‌: తాను కాంగ్రెసుకు వీడ్కోలు చెప్పి తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లో చేరుతున్నట్లు వచ్చిన వార్తలపై భూపాలపల్లి శాసనసభ్యుడు గండ్ర వెంకటరమణా రెడ్డి స్పందించారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర బాబు గండ్ర వెంకటరమణా రెడ్డితో ఇష్టాగోష్ఠిగా చర్చలు జరిపారు.  

పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను గండ్ర వెంకట రమణారెడ్డి ఈ సందర్భంగా ఖండించారు. ఖండించారు.  ముగ్గురు నాయకులు కాసేపు రాష్ట్ర రాజకీయాలపై చర్చించారు. గండ్ర వెంకట రమణా రెడ్డి కాంగ్రెసుకు గుడ్ బై చెప్పి టీఆర్ఎస్ లో చేరడానికి సిద్ధపడినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

టీఆర్ఎస్ లోకి వస్తే గండ్ర వెంకటరమణా రెడ్డి సతీమణికి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవి ఇస్తామని కూడా టీఆర్ఎస్ నాయకత్వం ఆఫర్ ఇచ్చినట్లు చెబుతున్నారు. గండ్రతో పాటు సంగారెడ్డి శాసనసభ్యుడు తూర్పు జయప్రకాశ్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే పోడెం వీరయ్య టీఆర్ఎస్ లో చేరుతారని వార్తలు వచ్చాయి.

సంబంధిత వార్తలు

టీఆర్ఎస్‌లో సీఎల్పీ విలీనానికి రంగం సిద్దం: 13 మంది ఎమ్మెల్యేల సంతకాలు?

చివరికి మిగిలేది ఆ ముగ్గురే: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు (వీడియో)

టీఆర్ఎస్ లోకి జంప్: గండ్ర భార్యకు కేసీఆర్ బంపర్ ఆఫర్

కాంగ్రెసుకు భారీ షాక్: టీఆర్ఎస్ లోకి మరో ముగ్గురు ఎమ్మెల్యేలు

click me!