మధ్యప్రదేశ్ ఏటీఎస్, హైద్రాబాద్ పోలీసుల సోదాలు నిర్వహించాయి. మొత్తం 16 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైద్రాబాద్ కు చెందిన ఐదుగురు టెక్కీలుగా గుర్తించారు.
హైదరాబాద్: మధ్యప్రదేశ్ ఏటీఎస్, తెలంగాణ పోలీసులు హైద్రాబాద్ లో జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ జాయింట్ ఆపరేషన్ లో కీలక విషయాలు వెలుగు చూశాయి. మొత్తం 16 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో 11 మంది మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు.. హైద్రాబాద్ కు చెందిన వారు ఐదుగురున్నారు.. హైద్రాబాద్ కు చెందినవారు ఉన్నత విద్యావంతులు. ఈ ఐదుగురు కూడా సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు.
హైద్రాబాద్ పాతబస్తీలో 16 మంది ఉంటున్నారు. 18 నెలలుగా వీరంతా ఇక్కడే ఉంటున్నారని నిఘా సంస్థలు గుర్తించాయి.. ఉగ్ర సంస్థలతో వీరికి సంబంధాలున్నాయనే అనుమానంతో వీరిపై నిఘా పెట్టారు. సుమారు నెల రోజులుగా వీరిపై నిఘా ఏర్పాటు చేశారు. ఇవాళ ఉదయం మధ్యప్రదేశ్ ఏటీఎస్, తెలంగాణ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు.
హైద్రాబాద్ కు చెందిన ఐదుగురిని మధ్యప్రదేశ్ కు తీసుకెళ్లింది ఏటీఎస్ టీమ్. సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తూ ఉగ్ర కార్యకలాపాలకు ఈ ఐదుగురు సహకరిస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ విషయమై ఈ ఐదుగురిని పోలీసులు విచారించనున్నారు. హైద్రాబాద్ లో అరెస్టైన 16 మంది ఒ సంస్థతో సంబంధాలు కలిగి ఉన్నారని పోలీసులు గుర్తించారు.
also read:ఉగ్ర మూలాలపై మధ్యప్రదేశ్, తెలంగాణ పోలీసుల ఆపరేషన్: హైద్రాబాద్‌లో 16 మంది అరెస్ట్
హైద్రాబాద్ లో ఇంత కాలం ఏం చేశారు, వీరి ప్లాన్ ఏమిటనే విషయాలపై దర్యాప్తు సంస్థలు ఆరా తీయనున్నాయి. మరో వైపు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఆరుగురు అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు.