
హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వాడెంత... వాడి పర్సనాలిటీ ఎంత... పిసికితే ప్రాణం పోతుంది నా కొడుక్కి అంటూ రేవంత్ పై తలసాని తీవ్ర వ్యాఖ్యలు చేసారు.
సోమవారం హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన యూత్ డిక్లరేషన్ సభలో రేవంత్ మాటలకు తలసాని ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఆ పొట్టోడు ఇంత లేడు... నోటికి ఏదొస్తే అదే మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. ఎమ్మెల్యేలు, మంత్రులు అన్న కనీస గౌరవం లేకుండా అందరినీ వాడు వీడు అంటూ పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నాడంటూ రేవంత్ పై మంత్రి తలసాని విరుచుకుపడ్డారు.
ఇక నూతన సచివాలయంలో ప్రతిపక్షాలను రానివ్వడం లేదని ... దాన్ని బిఆర్ఎస్ కార్యాలయంలా మార్చుకున్నారన్న విమర్శలకు కూడా మంత్రి కౌంటరిచ్చారు. పాత సెక్రటేరియట్ స్థానంలో కొత్తది నిర్మిస్తామంటే ప్రతిపక్షాలు ఎంత గొడవ చేసాయో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని అన్నారు. కోర్టులను ఆశ్రయించి మరీ అడ్డుకోవాలని చూసారన్నారు. కానీ ఈరోజు నా కొడుకులు సచివాలయంలోకి మేం కూడా వస్తామంటున్నారని తలసాని తీవ్ర వ్యాఖ్యలు చేసారు.
Read More కేసీఆర్ సర్కార్ అల్టిమేటం: తగ్గేదేలేదన్న జూనియర్ పంచాయితీ సెక్రటరీలు
సెక్రటేరియట్ అనేది రాష్ట్ర పాలనకు సంబంధించింది... ప్రజల కోసం ఎవరైనా రావచ్చని అన్నారు. కానీ కేవలం రాజకీయాల కోసమే సచివాలయానికి వస్తామంటున్న వారికి మాత్రమే అనుమతించడం లేదన్నారు. సంక్షేమ పాలన అందించేందుకే సచివాలయం ఉంది... రాజకీయాలో కోసం కాదని మంత్రి తలసాని పేర్కొన్నారు.
ఇక తెలంగాణ నూతన సచివాలయాన్ని అమెరికా ప్రెసిడెంట్ నివాసభవనం వైట్ హౌస్ తో పోల్చారు మంత్రి తలసారు. చూస్తే వైట్ హౌస్ చూడాలి లేదంటే తెలంగాణ సెక్రటేరియట్ చూడాలని అన్నారు. ఈ అద్భుత సచివాలయ భవనానికి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరుపెట్టామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.