హైద్రాబాద్ నగరంలో మధ్యప్రదేశ్ ఏటీఎస్, తెలంగాణ పోలీసుల జాయింట్ ఆపరేషన్ లో కీలక విషయాలు వెలుగు చూశాయి. దేశంలో విధ్వంసం సృష్టించేందుకు నిందితులు ప్లాన్ చేశారు.
హైదరాబాద్: నగరంలో మధ్యప్రదేశ్ ఏటీఎస్, తెలంగాణ పోలీసులు నిర్వహించిన జాయింట్ ఆపరేషన్ లో
కీలక విషయాలు వెలుగు చూశాయి. హైద్రాబాద్ కు చెందిన ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా ఉన్నత విద్యావంతులు. అరెస్టు చేసిన వారంతా హిజ్బ్ ఉత్ తహరీక్ అనే సంస్థతో సంబంధాలు కలిగి ఉన్నారని పోలీసులు గుర్తించారు.
హైద్రాబాద్ నగరంలోని గోల్కోండలో సౌరభ్ రాజ్ అలియాస్ మహ్మద్ సలీం .అబ్దుల్ రహమాన్ అలియాస్ దేవీ ప్రసాద్ పాండ , మహ్మద్ అబ్బాస్ అలీ అలియాస్ బాస్క వేణుకుమార్ , మహ్మద్ హమీద్ అలియాస్ ఖాజా మహ్మద్ , షేక్ జునైద్ అలియాస్ షేక్ జలీల్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని నిన్న భోపాల్ కు తరలించారు.
హైద్రాబాద్ లో నిన్న మొత్తం 16 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో 11 మంది మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు. మిగిలినవారు తెలంగాణకు చెందినవారు. హైద్రాబాద్ లో అరెస్టైన తెలంగాణకు చెందిన ఐదుగురిలో ముగ్గురు మారుపేర్లతో ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు.
హైద్రాబాద్ లో యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించేందుకు ప్రయత్నించినట్టుగా పోలీసులు గుర్తించారు. పేలుడు పదార్ధాల తయారీ, ఆయుధాల వినియోగంలో యువతకు శిక్షణ ఇచ్చినట్టుగా పోలీసులు గుర్తించారు. వికారాబాద్ అడవుల్లో వీరికి పేలుడు పదార్థాల తయారీ , ఆయుధాల వినియోగంలో శిక్షణ ఇచ్చారని పోలీసులు గుర్తించారు.
గత కొంత కాలంగా వీరిపై మధ్యప్రదేశ్ ఏటీఎస్ నిఘాను ఏర్పాటు చేసింది. మూడు రోజుల క్రితం ఏటీఎస్ టీమ్ హైద్రాబాద్ కు చేరింది. హైద్రాబాద్ కు చెందిన కౌంటర్ ఇంటలిజెన్స్ టీమ్ తో హైద్రాబాద్ లో ఉంటున్న 16 మంది గురించి సమాచారం ఇచ్చారు. తెలంగాణ కౌంటర్ ఇంటలిజెన్స్ టీమ్ కూడా వీరి పై నిఘా పెట్టింది. నిన్న ఉదయం హైద్రాబాద్ లో ఉన్న 16 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
also read:ఉగ్రమూలాలపై హైద్రాబాద్‌లో ఏటీఎస్ సోదాలు: ఆ ఐదుగురు టెక్కీలు
దేశంలో విధ్వంసానికి నిందితులు ప్లాన్ చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే నిందితులు ఎక్కడెక్కడ పేలుళ్ల ప్లాన్ చేశారనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.