ఇంటర్ రిజల్ట్స్ : రాష్ట్రవ్యాప్తంగా.. 8మంది విద్యార్థుల బలవన్మరణం..!

Published : May 10, 2023, 08:32 AM IST
ఇంటర్ రిజల్ట్స్ : రాష్ట్రవ్యాప్తంగా.. 8మంది విద్యార్థుల బలవన్మరణం..!

సారాంశం

పరీక్షల్లో ఫెయిల్ అవ్వడం, మార్పులు తక్కువ రావడంతో మనస్థాపం చెందిన విద్యార్థులు బలవన్మరణానికి  పాల్పడడం రాష్ట్రవ్యాప్తంగా విషాదాన్ని నింపింది.  

తెలంగాణ : తెలంగాణలో మంగళవారం ఇంటర్ పరీక్ష ఫలితాలు విడుదలైన సంగతి తెలిసింది. ఈ పరీక్షల్లో ఫెయిల్ అవ్వడం,  మార్కులు తక్కువ రావడం వంటి కారణాలతో రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో 8మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. జగిత్యాల,   నిజామాబాద్,పటాన్చెరు, గద్వాల, హైదరాబాద్, సికింద్రాబాద్, ఖైరతాబాద్, నారాయణపేటలలో ఈ విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వివరాలలోకి వెళితే..

- జగిత్యాలలోని  ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న  జగిత్యాల జిల్లా మేడిపల్లికి చెందిన ఓ విద్యార్థి (16) నాలుగు సబ్జెక్టులలో ఫెయిలయ్యాడు. దీంతో మనస్థాపానికి గురై ఇంట్లోనే ఉరి వేసుకునే ఆత్మహత్య చేసుకున్నాడు.

- హైదరాబాదులోని ఒక కార్పొరేట్ విద్యాసంస్థలో నిజామాబాద్ జిల్లా ఆర్మూరుకు చెందిన విద్యార్థి(17) బైపిసి ఫస్టియర్ చదివాడు. నిన్నటి ఫలితాల్లో మూడు సబ్జెక్టుల్లో ఫెయిల్ అవ్వడంతో ఇంట్లో ఉరేసుకున్నాడు.

ఘోరం.. భర్త వేధింపులు భరించలేక ఇద్దరు పిల్లలతో కలిసి మహిళ ఆత్మహత్య.. ఎక్కడంటే ?

- ఈసీఐఎల్ రామకృష్ణాపురంలో ఉంటున్న తిరుపతికి చెందిన విద్యార్థి (17)  పటాన్చెరులోని ఓ కాలేజీలో ఎంపీసీ చదువుకున్నాడు. మంగళవారం పరీక్ష ఫలితాలు విడుదల కానున్న నేపథ్యంలో ఫెయిల్ అవుతానేమోనని మనస్థాపనతో సోమవారం సాయంత్రమే ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఆ తర్వాత తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు వెతకగా మంగళవారం ఉదయం గుండ్ల పోచంపల్లి – మేడ్చల్ రైల్వే స్టేషన్ల మధ్య పట్టాల మీద ఆ విద్యార్థి మృతదేహం లభించింది. అయితే ఆ విద్యార్థి ఫలితాలు ఏమయ్యాయో తెలియలేదు.

- హైదరాబాదులోని ఓ ప్రైవేట్ కాలేజీలో గద్వాల మండలంలోని ఓ గ్రామానికి చెందిన విద్యార్థి (17)  చదువుకుంటున్నాడు. నిన్నటి ఫలితాల్లో ఫస్ట్ ఇయర్ లో ఒక సబ్జెక్టు ఫెయిలయ్యాడు. దీంతో మనస్థాపంతో ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

- హైదరాబాదులో ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ ఎంపీసీ చదువుకున్న ప్రకాశం జిల్లాకి చెందిన విద్యార్థిని (17)  ఫెయిల్ అయ్యానని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

- సికింద్రాబాద్ లోని నేరేడుమెట్ ఠాణా పరిధి వినాయక నగర్ కు చెందిన ఓ ఇంటర్ సెకండియర్ ప్రైవేట్ కాలేజీ విద్యార్థి ఒక సబ్జెక్టులో ఫెయిల్ అవ్వడంతో ఆత్మహత్య చేసుకున్నాడు.

- ఎస్సార్ నగర్ లోని ఓ ప్రైవేట్ కాలేజీలో బైపీసీ రెండో సంవత్సరం చదువుకున్న ఖైరతాబాద్ తుమ్మల బస్తికి చెందిన విద్యార్థి (17)  ఒక సబ్జెక్టులో ఫెయిల్ అయ్యాడు. దీంతో ఇంట్లోనే ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

- మరో ఘటనలో ఇంటర్లో ఫెయిల్ అయ్యానన్న మనస్థాపంతో ఓ విద్యార్థిని ఇంట్లో నుంచి అదృశ్యమయింది. ఈ ఘటన బీడీఎల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బీడీఎల్ ఎస్సై సాయిలు తెలిపిన వివరాల ప్రకారం.. భవాని అనే ఇంటర్ సెకండియర్ విద్యార్థిని…పటాన్చెరువు సమీప పాఠి గ్రామంలో ఉంటుంది.  ఇంటర్ సెకండియర్ లో కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ అయింది. దీంతో మనస్థాపం చెందిన ఆమె బయటికి వెళ్లి వస్తానంటూ అక్కకు చెప్పి వెళ్ళింది. ఆ తర్వాత ఇంటికి తిరిగి రాలేదు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

హైదరాబాద్‌లో 72 అంత‌స్తుల బిల్డింగ్‌.. ఎక్క‌డ రానుందో తెలుసా.? ఈ ప్రాంతంలో రియ‌ల్ బూమ్ ఖాయం
IMD Cold Wave Alert: మ‌రో 2 రోజులు చుక్క‌లే.. దారుణంగా ప‌డిపోనున్న ఉష్ణోగ్ర‌త‌లు