పదేళ్ళ కిందట ప్రేమపెళ్లి.. వరకట్న వేధింపులు తాళలేక.. ముగ్గురు పిల్లలతో కలిసి మహిళ ఆత్మహత్య...

By SumaBala Bukka  |  First Published Jul 1, 2023, 12:22 PM IST

ప్రేమించి, పెళ్లి చేసుకున్న భర్త.. వరకట్న వేధింపులకు పాల్పడుతుండడంతో తట్టుకోలేని ఆ భార్య ముగ్గురు పిల్లలతో కలిసి, ఆత్మహత్య చేసుకుంది. 


సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం కొదురుపాకలో శుక్రవారం విషాద ఘటన చోటుచేసుకుంది. ముగ్గురు చిన్నారులను జల సమాధి చేసి తాను ఆత్మహత్య చేసుకుంది ఓ మహిళ. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త.. పెళ్లి తర్వాత వేధింపులకు గురి చేస్తుండడంతో అతని వేధింపులు భరించలేక ముగ్గురు పిల్లల్ని చంపేసి తాను ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలను బంధువులు పోలీసులు ఇలా తెలిపారు…

రజిత అలియాస్ నేహ (30)  అనే మహిళ వేములవాడ మండలం రుద్రవరం నివాసి. కంప్యూటర్ నేర్చుకోవడం కోసం కరీంనగర్ కు వెళ్తుండేది. ఆ క్రమంలో  కరీంనగర్ సుభాష్ నగర్కు చెందిన మహమ్మద్ అలీతో పరిచయం ఏర్పడింది. అలీ అరటి పండ్లు విక్రయించేవాడు. వీరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. అయితే వీరి ప్రేమకి ఇరు కుటుంబాల వారు ఒప్పుకోలేదు.

Latest Videos

undefined

భర్త జల్సాలకు అలవాటు పడి.. అప్పులు చేస్తున్నాడని.. సుపారీ ఇచ్చి హత్య చేయించిన భార్య..

అయినా ఒకరినొకరు కావాలనుకున్న వీరిద్దరూ ఇంట్లో నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. వీరికి మహమ్మద్ అయాన్ష్ (7), అశ్ర జబీన్ (5),  ఉస్మాన్ మహమ్మద్ (14 నెలలు) అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇంట్లో నుంచి వెళ్లిపోయి పెద్దల్ని కాదని పెళ్లి చేసుకున్నా.. కొద్ది రోజుల తర్వాత వరకట్న వేధింపులు మొదటి పెట్టాడు అలీ. దీంతో ఏం చేయాలో పాలుపోనీ రజిత వేములవాడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఆ సమయంలో తన ప్రవర్తన మార్చుకుంటానని, రజితను బాగా చూసుకుంటానని అక్కడి లోక్ అదాలత్ లో అలీ మాట ఇచ్చి రాజీ కుదుర్చుకున్నాడు.

దీని తర్వాత రజిత కుటుంబ సభ్యులతో గొడవ పడడం మొదలుపెట్టాడు. జూన్ 27వ తేదీన భార్య ముగ్గురు పిల్లలను ఆమె తల్లిగారిల్లు అయిన రుద్రవరంలోని ఇంట్లో దింపాడు. పెళ్లయిన తర్వాత ఏం చేస్తామంటూ రజిత తల్లిదండ్రులు రాజనర్సు లక్షలు ఆమెకు సర్ది చెప్పి భర్త దగ్గరకు వెళ్లాలని బస్టాండ్ దగ్గర దింపేశారు. రజితను భర్త వేధిస్తున్నారని వేములవాడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు.

వారి ఫిర్యాదు మీద స్పందించిన పోలీసులు బక్రీద్ తర్వాత పిలుస్తామని చెప్పారు. దీంతో తల్లిదండ్రులు ఇద్దరు రుద్రవరం చేరుకున్నారు. కాగా శుక్రవారం కొదురుపాక మధ్యమనేరు జలాశయంలో వివాహిత, ముగ్గురు పిల్లల మృతదేహాలు కనబడడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.  ఈ సమాచారం మేరకు అక్కడ చేరుకున్న వేములవాడ పోలీసులు మృతదేహాల దగ్గర లభించిన చిరునామా ఫోన్ నెంబర్ల ఆధారంగా చనిపోయింది రజితగా గుర్తించారు.

వెంటనే రజిత భర్త అలీ, ఆమె సోదరుడికి సమాచారం అందించారు. మృతదేహాలను శవపరీక్షల కోసం సిరిసిల్ల ఆసుపత్రికి తరలించారు.  దీని రజిత తమ్ముడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. కట్నం కోసం వేధించడంతోనే రజిత ఆత్మహత్య చేసుకున్నట్లుగా ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

click me!