కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ రేపు సాయంత్రం గన్నవరం విమానాశ్రయం నుండి ఖమ్మం జిల్లాకు చేరుకుంటారు.
ఖమ్మం: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ రేపు సాయంత్రం గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. గన్నవరం విమానాశ్రయం నుండి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఖమ్మంకు చేరుకుంటారు.
సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర ఈ నెల 2వ తేదీన ఖమ్మంలో ముగియనుంది. ఈ పాదయాత్ర ముగింపును పురస్కరించుకొని ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభను నిర్వహిస్తుంది. ఈ సభకు భారీగా జనాన్ని సమీకరించనున్నారు. ఇదే సభభలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ సభలో రాహుల్ గాంధీ పాల్గొంటారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ఈ సభ శంఖారావం పూరించనుంది. న్యూఢిల్లీ నుండి రాహుల్ గాంధీ విమానంలో రేపు సాయంత్రం నాలుగు గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టు చేరుకుంటారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుండి ప్రత్యేక హెలికాప్టర్ లో ఖమ్మంకు చేరుకుంటారు. ఖమ్మంలో కాంగ్రెస్ సభలో పాల్గొన్న తర్వాత రాహుల్ గాంధీ గన్నవరం ఎయిర్ పోర్టు నుండి తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు.
also read:భట్టి ఫీడ్ బ్యాక్ ఆధారంగా కాంగ్రెస్ మేనిఫెస్టో: రేవంత్ రెడ్డి
ఈ ఏడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ నాయకత్వం పట్టుదలగా ఉంది. ఖమ్మం సభతో ఎన్నికల శంఖారావాన్ని కాంగ్రెస్ పార్టీ పూరించనుంది.