
హైదరాబాద్ : మహారాష్ట్రలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో చిక్కుకుని బస్సులో ప్రయాణిస్తున్న పలువురు మరణించడం, మరికొందరు తీవ్రంగా గాయపడడం పట్ల బిఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు, తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు సంతాపాన్ని ప్రకటించారు.
మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని బిఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.
అయితే దీనిమీద బస్సు ఓనర్ వీరేంద్ర ధర్మ మాట్లాడుతూ.. బస్సు బాగానే ఉందన్నారు. అన్ని పర్మిషన్లు అన్నీ ఉన్నాయి. 2020లో తీసుకున్నాం. లాక్ డౌన్ లో ఒక సంవత్సరం బస్సును నడిపించలేదు. డ్రైవర్ గణేష్ కూడా ఎక్స్ పీరియన్స్ డ్. లాక్ డౌన్ తరువాత నడిపిస్తున్నాం. బస్సు కొత్తది. ఇది కేవలం ప్రమాదం వల్లే జరిగిందన్నారు.
కాగా, శుక్రవారం ఉదయం మహారాష్ట్రలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఓ రన్నింగ్ బస్సులో మంటలు చెలరేగడంతో 25మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు.నాగ్ పూర్-పూణె హైవే మీద బస్సు వెల్తుండగా.. బస్సు టైర్ పేలడంతో మంటలు అంటుకున్నాయి. దీంతో బస్సు అదుపు తప్పి ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో మరో 8మందికి తీవ్ర గాయాలయ్యాయి.
ప్రమాద సయంలో బస్సులో 33 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు. అర్థరాత్రి 2 గంటల సమయంలో బస్సులో మంటలు చెలరేగాయి. గుల్దానా సమీపంలో ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని గుల్దానాలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బస్సు నాగ్ పూర్ నుంచి ఫూణె వెడుతుండగా ప్రమాదం జరిగింది.