హైదరాబాద్ శివారులో యాక్సిడెంట్... కారును ఢీకొని లారీ డ్రైవర్ మృతి

By Arun Kumar P  |  First Published May 30, 2023, 10:39 AM IST

రోడ్డుపక్కన ఆగివున్న కారును ఢీకొని లారీ డ్రైవర్ ప్రాణాలు కోల్పోయిన రాజేంద్రనగర్ లో చోటుచేసుకుంది. 


రంగారెడ్డి : ఇవాళ(మంగళవారం) ఉదయం హైదరాబాద్ శివారులో జరిగిన రోడ్డుప్రమాదంలో లారీ డ్రైవర్ మృతిచెందాడు. వేగంగా వెళుతున్న లారీ అదుపుతప్పి రోడ్డుపక్కన ఆగివున్న కారును ఢీకొట్టింది. అయితే ఈ ఘటనలో కారులోనివారు సురక్షితంగా బయటపడ్డా లారీ డ్రైవర్ మాత్రం ప్రాణాలు కోల్పోయాడు.  

వివరాల్లోకి వెళితే... కర్నూల్ నుండి హైదరాబాద్ కు ధాన్యం లోడ్ తో లారీ బయలుదేరింది. మరికొద్దిసేపట్లో గమ్యానికి చేరుతుందనగా లారీ ప్రమాదానికి గురయ్యింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వయూనివర్సిటీ సమీపంలో వేగంగా వెళుతున్న లారీ అదుపుతప్పింది. రోడ్డుపక్కకు దూసుకుళ్లిన లారీ ఆగివున్న ఓ కారును ఢీకొట్టి ఆగింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు. 

Latest Videos

భారీ లారీ ఢీకొట్టినప్పటికి కారులోని వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. లారీ డ్రైవర్ నిద్రమత్తులో డ్రైవింగ్ చేయడమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. లారీతో పాటు కారు స్వల్పంగా  ధ్వంసమయ్యాయి. 

Read More  విషాదం.. మహానాడు నుంచి వెడుతుండగా రోడ్డు ప్రమాదం.. టీడీపీ నాయకుడి మృతి.. గతంలో అన్నావదినలు కూడా...

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని లారీ డ్రైవర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ధాన్యం లోడ్ లారీతో పాటు కారును రోడ్డుపైనుండి పక్కకు జరిపించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 
 

click me!