నిర్మల్ లో విషాదం.. తేనెటీగల దాడి నుంచి తప్పించుకోవాలని బావిలో దూకిన యువకుడు.. ఈతరాకపోవడంతో..

By Asianet NewsFirst Published May 30, 2023, 6:48 AM IST
Highlights

నిర్మల్ జిల్లాలోని సోన్ మండలంలో విషాదం చోటు చేసుకుంది. శాకెర గ్రామానికి చెందిన ఓ యువకుడు తేనెటీగల దాడి నుంచి తప్పించుకోవాలని బావిలో దూకాడు. కానీ ఈత రాకపోవడంతో నీట మునిగి చనిపోయాడు. 

తేనెటీగల దాడి నుంచి తప్పించుకునేందుకు ఓ యువకుడు చేసిన పని అతడి ప్రాణాల మీదకి తెచ్చింది. ఆ కీటకాల గుంపు ఒక్క సారిగా మీదకి వస్తుండటంతో ఏం ఆలోచించకుండా అతడు బావిలోకి దూకేశాడు. కానీ తనకు ఈత రాదన్న విషయం మర్చిపోయాడు. యువకుడు బావిలో దూకడాన్ని ఎవరూ గమనించకపోవడంతో అతడు నీటిలోనే మునిగి చనిపోయాడు. ఈ ఘటన నిర్మల్ జిల్లాలో సోన్ మండలంలో చోటు చేసుకుంది.

యువతితో లేచిపోయిన యువకుడు..పెళ్లి చేస్తామని పిలిచి ముఖానికి నల్లరంగు పూసి, బూట్ల దండతో ఊరేగింపు.. వీడియో వైరల్

వివరాలు ఇలా ఉన్నాయి. సోన్ మండలంలోని శాకెర గ్రామంలో 27 ఏళ్ల కల్లెడపు నర్సయ్య నివసిస్తున్నాడు. అయితే ఆ గ్రామస్తులంతా గ్రామంలో సోమవారం భీమన్న పండుగ జరుపుకున్నారు. అందులో భాగంగా గ్రామ ప్రజలంతా డప్పుల మోతలతో ఊరేంపుగా గ్రామంలోని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఆ గుడి పక్కనే ఓ మర్రి చెట్టు ఉంది. దానిపై తేనెటీగలు తెట్టె పెట్టాయి. అయితే డప్పుల మోతతో గ్రామస్తులంతా ఇలా ప్రదిక్షిణలు చేస్తున్న సమయంలో తేనెటీగలు ఒక్కసారిగా లేచాయి.

మానవత్వం చూపించిన సీఎం సిద్ధరామయ్య.. హత్యకు గురైన బీజేపీ నేత భార్యకు మళ్లీ ఉద్యోగమిస్తామని ప్రకటన

గుడి చుట్టుపక్కల, మర్రి చెట్టు కింద ఉన్న ప్రజలపై దాడి చేయడం ప్రారంభించాయి. దీంతో వారంతా తమకు తోచిన వైపు పరిగెత్తడం ప్రారంభించారు. ఈ క్రమంలో కల్లెడపు నర్సయ్య కూడా ఓ వ్యవసాయ క్షేత్రంవైపు పరుగులు తీశాడు. ఇలా పరిగెత్తుతున్న క్రమంలో తేనెటీగల దాడి నుంచి తప్పించుకునేందుకు ఓ చేన్లో ఉన్న బావిలోకి దూకేశాడు. అతడిని ఎవరూ గమనించలేదు. అయితే అతడికి ఈతరాకపోవడంతో అందులో నుంచి బయటపడలేక నీటిలో మునిగి చనిపోయాడు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

click me!