ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ నిప్పులు

By telugu team  |  First Published Jan 18, 2020, 5:05 PM IST

ఈ నెల 22న జరగనున్న ఎన్నికల ప్రచార నిమిత్తం తెలంగాణలోని ఏకైక బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ నిజామాబాదు లో పర్యటించారు. అక్కడ బైక్ ర్యాలీలో కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అధికార తెరాస పై, దాని అధ్యక్షుడు కేసీఆర్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 


తెలంగాణాలో మునిసిపల్ ఎన్నికలవేళ అన్ని పార్టీలమధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఒకరేమో అధికార పక్షం ఏమి చేసిందని నిలదీస్తుంటే, మరొకరేమో తామే అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్లమని చెప్పుకుంటున్నారు. ఏది ఏమైనా రాష్ట్రంలో రాజకీయ వాతావరణం బాగా వేడి మీద ఉందనేది మాత్రం వాస్తవం. 

ఇక రాష్ట్రంలో అనూహ్యంగా నాలుగు ఎంపీ సీట్లు గెలిచి మంచి జోరుమీదున్న బీజేపీ రాష్ట్రంలోని కొన్ని ప్రధాన మునిసిపాలిటీలను టార్గెట్ చేసింది. ఎక్కడైతే ఈ నలుగురు ఎంపీలు గెలిచారో ఆయా చోట్ల తమ రాజకీయ గెలుపవకాశాలను పెంచుకునేందుకు తీవ్రస్థాయిలో కృషి చేస్తున్నారు. 

Latest Videos

undefined

Also read: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌‌కు పోలీసుల షాక్: రౌడీషీట్ ఓపెన్

ఈ నెల 22న జరగనున్న ఎన్నికల ప్రచార నిమిత్తం తెలంగాణలోని ఏకైక బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ నిజామాబాదు లో పర్యటించారు. అక్కడ బైక్ ర్యాలీలో కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అధికార తెరాస పై, దాని అధ్యక్షుడు కేసీఆర్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 

నిజామాబాద్‌లో బీజేపీ బైక్ ర్యాలీ నిర్వహిస్తుండగా రాజాసింగ్ మాట్లాడుతూ కేసీఆర్‌ తెలంగాణను అప్పుల తెలంగాణగా మార్చారని మండిపడ్డారు. కేంద్ర నిధులతోనే రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేశారు తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది ఏమి లేదని ఆయన అన్నాడు.  

ఇంటింటికి నీళ్లు ఇవ్వకపోతే ఓట్లు అడగనన్న కేసీఆర్‌.. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని టీఆర్‌ఎస్‌ కు ఓటు వేయమని తెరాస నేతలు అడుగుతున్నారని ఆయన ప్రశ్నించారు. 

టీఆర్‌ఎస్‌కు అర్థబలం ఉంటే... బీజేపీ కి కార్యకర్తల బలం ఉందన్నారు రాజాసింగ్.  నిజామాబాద్ మేయర్‌ పదవిని గనుక ఎంఐఎంకి ఇస్తే కారు స్టీరింగ్ వారి చేతుల్లో ఉంటుందన్నారు. 

Also read: మహిళ హత్య కేసులో బిజెపి నేత రాజా సింగ్ అరెస్ట్...

భారత్‌లో ఉన్న ముస్లింలు అందరూ తమ అన్నదమ్ములేనని అన్నారు రాజా సింగ్. ప్రస్తుత కాలంలో  దేశ ద్రోహులు కూడా జాతీయ జెండా పట్టుకొని తిరుగుతున్నారని, అది చాలా ప్రమాదకరమని రాజా సింగ్ అన్నారు. 

click me!