దున్నపోతుకు గడ్డి వేస్తే బర్రె పాలు ఇస్తదా? సంగారెడ్డిలో హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు

By telugu teamFirst Published Jan 18, 2020, 1:45 PM IST
Highlights

హరీష్ రావు మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సంగారెడ్డికి ప్రచారానికి వెళ్లారు. అక్కడ తన చిరకాల ప్రత్యర్థి జగ్గా రెడ్డి అలియాస్ తూర్పు జయప్రకాశ్ రెడ్డి ఉండనే ఉన్నాడు. ఈ నేపథ్యంలో హరీష్ రావు ఆయనపై తీవ్ర విమర్శలు చేసారు. 

మునిసిపల్ ఎన్నికలవేళ రాష్ట్రంలో అన్ని పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పూర్తి మునిసిపల్ ఎన్నికల బాధ్యతలను కేటీఆర్ భుజస్కంధాలపై మోస్తుండడంతో హరీష్ రావు ఉమ్మడి మెదక్ జిల్లాకు మాత్రమే పరిమితమయ్యాడు. 

హరీష్ రావు మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సంగారెడ్డికి ప్రచారానికి వెళ్లారు. అక్కడ తన చిరకాల ప్రత్యర్థి జగ్గా రెడ్డి అలియాస్ తూర్పు జయప్రకాశ్ రెడ్డి ఉండనే ఉన్నాడు. ఈ నేపథ్యంలో హరీష్ రావు ఆయనపై తీవ్ర విమర్శలు చేసారు. 

జగ్గారెడ్డి మాటలకు ఎక్కువ.. చేతలకు తక్కువ అని స్థానిక ఎమ్మెల్యేను ఎద్దేవా చేశారు హరీష్. మునిసిపల్ ఎన్నికల వేళ సంగారెడ్డి బైపాస్ రోడ్డు దగ్గర మంత్రి హరీష్ రావు ప్రచారం నిర్వహిస్తుండగా ఈ వ్యాఖ్యలను చేసారు హరీష్ రావు. 

Also read: నా భార్యకు కూడా టికెట్ ఇవ్వను, కానీ చైర్ పర్సన్...: జగ్గారెడ్డి

రోడ్ షో సందర్భంగా మాట్లాడుతూ... మునిసిపల్ ఎన్నికల్లో గెలిచేది తెరాస పార్టీనే అని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేతిలో ఏమీ లేదని, ఇక్కడ ఉన్నది టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పుకొచ్చారు. 

కాంగ్రెస్ కు ఓటు ఎందుకు వేయకూడదో ఒక మోటు సామెత చెబుతూ ఉదహరించారు. దున్నపోతుకు గడ్డి వేస్తే బర్రె పాలు ఇస్తుందా? అనే నానుడిని ప్రస్తావిస్తూ... పాలు ఇచ్చే బర్రెకే కదా గడ్డి వేయాలని, అభివృద్ధి కోసం తెరాస ను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.  

ప్రజల దయతోనే నేడు టీఆర్ఎస్ అధికారంలో ఉందని, రాబోయే నాలుగేళ్లు కేసీఆర్ ప్రభుత్వమీ ఉంటుంది కాబట్టి, ఏవైనా అభివృద్ధి పనులు చేస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే చేయగలుగుతుంది తప్ప.. వేరే ఎవరైనా చేయగలుగుతారా? అని ప్రజలకు ఆలోచించుకోండంటూ ప్రశ్న వేశారు.  

Also read: కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి షాక్... సంగారెడ్డిలో హరీష్ మార్కు రాజకీయం

ఏడాది కాలంగా జగ్గారెడ్డి ఒక్క రూపాయి పని కూడా సంగారెడ్డిలో చేయలేదని విమర్శించారు  హరీష్.  పైసా పని చేయని ఆయన.. మిగతా నాలుగేళ్లు ఏం పని చేస్తారని ప్రశ్నించారు. 

అభివృద్ధి కోసం తెరాస అభ్యర్థులనే గెలిపించాలని ప్రజలకు హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. 35 కోట్లు సంగారెడ్డి మున్సిపాలిటీ అభివృద్ధికి మంజూరయ్యాయని హరీష్ రావు తెలిపారు.

ఈ సందర్భంగా తాజాగా పోతిరెడ్డిపల్లిలోని ఐదు వార్డులు సంగారెడ్డిలో కలిశాయని,  మున్సిపాలిటీలో ఉంటే నిధులు ఎక్కువ వస్తాయి కాబట్టి... ఈ ఐదు వార్డులు బాగా అభివృద్ధి  చెందుతాయని ఆశాభావం వ్యక్తం చేసారు. 

click me!