గుడ్ న్యూస్.. హైదరాబాద్‌కు మరో ప్రముఖ సంస్థ.. భారత్‌లో తొలి కేంద్రం ఇక్కడే.. కేటీఆర్‌తో భేటీ తర్వాత ప్రకటన

By team teluguFirst Published Oct 30, 2021, 5:00 PM IST
Highlights

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో అడుగుపెట్టేందుకు మరో ప్రముఖ సంస్థ సిద్దమైంది. ప్రపంచంలోనే ప్రముఖ ఇన్నోవేషన్ ప్లాట్‌ఫామ్ (Leading innovation platform) ప్లగ్ అండ్ ప్లే (Plug and Play) భారతదేశంలో తన మొదటి కేంద్రాన్ని ప్రారంభించనుంది. 

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో అడుగుపెట్టేందుకు మరో ప్రముఖ సంస్థ సిద్దమైంది. ప్రపంచంలోనే ప్రముఖ ఇన్నోవేషన్ ప్లాట్‌ఫామ్ (Leading innovation platform) ప్లగ్ అండ్ ప్లే (Plug and Play) భారతదేశంలో తన మొదటి కేంద్రాన్ని ప్రారంభించనుంది. హైదరాబాద్‌లో తమ క్యాంపస్ ఏర్పాటు చేయనున్నట్టుగా ప్లగ్ అండ్ ప్లే తెలిపింది. ప్రస్తుతం పారిస్ పర్యటనలో ఉన్న తెలంగాణ ఐటీ, పురపాల శాఖల మంత్రి కేటీఆర్‌తో జరిగిన సమావేశం అనంతరం ప్లగ్‌ అండ్‌ ప్లే తమ నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ పరిణామాన్ని మంత్రి కేటీఆర్ స్వాగతించారు. డిసెంబర్ మొదటి వారంలో హైదరాబాద్‌లో ప్లగ్ అండ్ ప్లే సెంటర్‌ను మంత్రి కేటీఆర్.. ప్లగ్ అండ్ ప్లే వ్యవస్థాపకుడు, సిఈఓ సయీద్ అమీది సమక్షంలో అధికారికంగా ప్రారంభించనున్నట్లు ప్లగ్ అండ్ ప్లే ఎగ్జిక్యూటివ్‌లు ప్రకటించారు. ప్లగ్ అండ్ ప్లే అమెరికాలోని సిలికాన్ వ్యాలీ, జర్మనీలోని స్టుట్‌గార్ట్, ఫ్రాన్స్‌లోని పారిస్, జపాన్‌లోని ఒసాకా, చైనాలోని షాంఘై, స్పెయిన్‌లోని వాలెన్సియా, నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డామ్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా 37 కార్యాలయాలను కలిగి ఉంది.

ప్లగ్‌ అండ్‌ ప్లే సంస్థ ఇప్పటి వరకు 35వేల స్టార్టప్‌లకు అండదండలు అందించింది. ఇందులో 530కు పైగా కంపెనీలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా లీడింగ్‌ కార్పోరేట్‌ కంపెనీలుగా ఉన్నాయి. వెంచర్‌ ఫండింగ్‌ ద్వారా ఇప్పటి వరకు 9 బిలియన్‌ డాలర్ల పెట్టుబడిని స్టార్టప్‌ కంపెనీలకు తెచ్చి పెట్టింది.

Also read: ఫ్రెంచ్ సెనేట్‌లో మంత్రి కేటీఆర్ అదిరిపోయే స్పీచ్.. తెలంగాణ ప్రగతి విధానాలు వివరించిన మంత్రి

 ప్లగ్ అండ్ ప్లే 2020 సంవత్సరంలో 2,056 స్టార్టప్‌లను వేగవంతం చేసింది. ఈ స్టార్టప్‌ల్లో అమెరికాలో 585, యూరప్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికాలో 438, ఆసియాలో 1,042 ఉన్నాయి. గతేడాది 162 వ్యుహాత్మక పెట్టబడులను చేసింది. గూగుల్, పేపాల్, డ్రాప్ బాక్స్, లీడింగ్ క్లబ్, ఎన్ 26, సౌండ్‌ హౌండ్, హానీ, కుస్టోమేర్, గార్డెంట్ హెల్త్‌లలో ప్లగ్ అండ్ ప్లే తొలిపెట్టుడి దారి. ఇది ముఖ్యమంగా మెబిలిటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐవోటీ), ఎనర్జీ, అగ్రిటెక్, ట్రావెల్, ఫిన్‌టెక్.. వర్టికల్స్ మీద దృష్టి పెడుతుంది. 

హైదరాబాద్‌లో ఏర్పాటు చేయబోయే కార్యాలయం Mobility, ఐవోటీ, ఎనర్జీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కోసం ఎకోసిస్టమ్‌ను బిల్డ్ చేస్తుంది. తదుపరి దశలో ఫిన్‌టెక్, లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్ సర్వీసులపై ఫోకస్ చేయనుంది. ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐవోటీ), స్మార్ట్‌సిటీస్‌ ఇంక్యుబేషన్ అమలు చేసేందకు హైదరాబాద్‌లోని ప్లగ్ అండ్ ప్లే టెక్ సెంటర్‌తో సీయాటెల్ కేంద్రంగా ఉన్న ట్రాయంగులమ్ ల్యాబ్స్, వెంచర్ ఫౌండ్రీ భాగస్వామ్యం కలిగి ఉంటాయి. 

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ‘ఇప్పటికే తెలంగాణలోని హైదరాబాద్ దేశంలోనే పెద్దదైన టీ హబ్‌ ఇంక్యుబేషన​ సెంటర్‌ ఉంది. ప్లగ్‌ అండ్‌ ప్లే సెంటర్ రావడం రాష్ట్రంలోని ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్‌కు గొప్ప ప్రోత్సాహం. జెడ్‌ఎఫ్, ఫియట్ క్రిస్లర్/స్టెల్లంటిస్‌తో సహా ఇటీవలి కాలంలో మొబిలిటీ రంగంలో అనేక ప్రధాన పెట్టుబడులను ఆకర్షించగలిగాము. అనేక OEMలు మరియు టైర్-I సరఫరాదారుల భాగస్వామ్యంతో ప్రపంచ స్థాయి మొబిలిటీ పర్యావరణ వ్యవస్థను రూపొందించే ప్రక్రియలో ఉన్నాం. భారతదేశంలోకి ప్రవేశించడానికి ప్లగ్ అండ్ ప్లే హైదరాబాద్‌ను ఎంచుకున్నందుకు మేము సంతోషిస్తున్నాము. హెల్త్‌కేర్, ఐవోటీ, ఎనర్జీ, ఫిన్‌టెక్ రంగాలకు విలవనిస్తూ తెలంగాణ ముందకు సాగుతుంది. మేము ప్రధాన పాత్ర పోషించడానికి ప్లగ్ అండ్ ప్లే సహకారం కోసం ఎదురుచూస్తున్నాము’ అని తెలిపారు. 

Also Read: తైవాన్ పెట్టుబడులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తాం.. ఇన్వెస్ట్ ఇండియా సమావేశంలో మంత్రి కేటీఆర్

భారతదేశంలోని ప్లగ్ అండ్ ప్లే యొక్క ప్రధాన లక్ష్యాలు..
- ఇండియన్‌ స్టార్టప్‌ కంపెనీలకు ప్లగ్‌ అండ్‌ ప్లే గేట్‌గా మారనుంది. అంకుర పరిశ్రమలకు ఇంటర్నేషన్‌ స్థాయిలో మద్దతు వచ్చేలా పని చేస్తుంది
- ఇండియా, ఇంటర్నేషనల్‌ స్థాయిలలో ఉన్న కార్పొరేట్‌ కంపెనీలకు స్టార్టప్‌లను అనుసంధానం చేసేందుకు ఉపకరిస్తుంది
- ఇండియన​ స్టార్టప్‌లకు వెంచర్‌ క్యాపిటలిస్టుగా ఉపయోగపడుతుంది
-ప్లగ్ అండ్ ప్లే భారతీయ స్టార్టప్‌లలో పెట్టుబడి పెడుతుంది. ప్రముఖ అంతర్జాతీయ VCల నెట్‌వర్క్‌ను పరిచయం చేస్తుంది

స్టార్టప్ ఆటోబాన్ ఎండీ సస్చా కరీంపూర్ మాట్లాడుతూ “మంత్రి కెటి రామారావు చూపిన ఉత్సాహం, మద్దతుతో  ప్లగ్ అండ్ ప్లే భారతదేశంలో అత్యంత విజయవంతమైన సహకార వేదికను నిర్మిస్తుంది. జర్మనీలోని స్టార్టప్ ఆటోబాన్ విజయాన్ని అనుకరిస్తుంది.  ఇదిరికార్డు సమయంలో.. మొబిలిటీ రంగంలో స్థాపించబడిన కార్పొరేషన్లు, టెక్ స్టార్టప్‌ల మధ్య కొత్త సాంకేతిక సహకారానికి అంతర్జాతీయ కేంద్రంగా మారింది’ అని తెలిపారు.

click me!