కడుపులో సూది, దారంతో నాలుగేళ్లు నరకయాతన.. ఆపరేషన్ చేసిన వైద్యుడి నిర్వాకం... !

Published : Oct 30, 2021, 11:50 AM IST
కడుపులో సూది, దారంతో నాలుగేళ్లు నరకయాతన.. ఆపరేషన్ చేసిన వైద్యుడి నిర్వాకం... !

సారాంశం

కడుపు నొప్పితో సిరిసిల్లాలోని ఓ ఆసుపత్రికి వెళ్లిన మహిళకు ఆపరేషన్ చేసిన వైద్యుడు కడుపులోనే సూది, దారం మరిచిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాధిత మహిళకు ఇటీవల మళ్లీ కడుపునొప్పి వస్తుండడంతో స్కానింగ్ చేయించుకోగా అసలు విషయం వెలుగు చూసింది.

సిరిసిల్ల : ఆపరేషన్ తరువాత కడుపులో కత్తులు, కత్తెరలు, దూది, సూదులు మరిచిపోవడంలాంటి సంఘటనలు అప్పుడప్పుడూ వింటూనే ఉంటాం. వీటిమీద అనేక సినిమాల్లో కామెడీ సన్నివేశాలు, జోక్స్ చాలా వచ్చాయి. అయితే ఇలాంటి సంఘటనలు విన్నప్పుడు నవ్వుతెప్పించినా.. సదరు పేషంట్ కు నరకం కనిపిస్తుంది. 

సదరు పేషంట్ నరకయాతన అనుభవిస్తుంది. చికిత్స చేసినా ఎందుకిలా జరుగుతుందో తెలియన ఆందోళనపడతారు. అలాంటి దారుణమైన ఘటన ఒకటి సిరిసిల్లలో చోటు చేసుకుంది. 

కడుపు నొప్పితో సిరిసిల్లాలోని ఓ ఆసుపత్రికి వెళ్లిన మహిళకు ఆపరేషన్ చేసిన వైద్యుడు కడుపులోనే సూది, దారం మరిచిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాధిత మహిళకు ఇటీవల మళ్లీ కడుపునొప్పి వస్తుండడంతో స్కానింగ్ చేయించుకోగా అసలు విషయం వెలుగు చూసింది.

సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం ఇందిరా నగర్ కు చెందిన  లచ్చవ్వ Abdominal painతో బాధపడుతూ నాలుగేళ్ల క్రితం  సిరిసిల్లాలోని అంబేద్కర్ చౌరస్తాలో ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్ళింది. ఆమెను పరీక్షించిన వైద్యుడు Uterine operation చేశాడు.

కొన్నాళ్ళకు కడుపులో నొప్పి రావడంతో తాత్కాలిక ఉపశమనం కోసం ఆమె టాబ్లెట్లు వాడింది. ఇటీవల pain తీవ్రం కావడంతో స్కానింగ్ చేయించి కడుపులో ఉన్నట్లు నిర్ధారించారు.  గర్భసంచి ఆపరేషన్ సమయంలో కుట్లు వేయడానికి  ఉపయోగించిన Needle, thread కడుపులోనే మర్చిపోవడంతో తరచు ఈ కడుపు నొప్పి వస్తున్నట్లు తెలిపారు.

అయితే అప్పుడు ఆపరేషన్ చేయించుకున్న ఆసుపత్రి వివిధ కారణాలతో మూతపడింది.  ప్రస్తుతం మరో చోట పనిచేస్తున్న వైద్యుడిని సంప్రదిస్తే తనకు సంబంధం లేదని,  దిక్కున్న చోట చెప్పుకో అని అనడంతో బాధితురాలు  కన్నీరుమున్నీరవుతోంది. తనకు న్యాయం చేయాలని లచ్చవ్వ వేడుకుంటుంది. 

ఆరేళ్ల చిన్నారికి చాక్లెట్ ఆశచూపి.. సర్పంచి భర్త లైంగిక దాడి..

భర్తను రాళ్లతో కొట్టి దారుణంగా చంపిన భార్య...

సంగారెడ్డిలో భర్త మృతికి కారణమైన భార్యను, ఆమె ప్రియుడిని శుక్రవారం రిమాండ్ కు తరలించినట్లు మోమిన్ పేట్ సీఐ వెంకటేశం తెలిపారు. వివరాలను విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. 

మండలానికి చెందిన చిన్నమల్కు శివశంకర్ (30)కు సంగారెడ్డి జిల్లా సదాశివపేటకు చెందిన మహిళతో వివాహం జరిగింది. వారికి ముగ్గురు సంతానం. సంవత్సరం క్రితం ఆమె భర్తతో గొడవపడి పుట్టింటికి వెళ్లింది. 

ఆ సమయంలో సంగారెడ్డికి చెందిన జహంగీర్ తో పరిచయం ఏర్పడింది. అది కాస్తా Extramarital affairకి దారి తీసింది. ఇటీవల మళ్లీ ఆమె భర్త దగ్గరకు రావడంతో జహంగీర్ శివశంకర్ తో పరిచయం పెంచుకున్నాడు. 

ఇద్దరూ కలిసి Alcohol తాగేవారు. ఇటీవల మళ్లీ శివశంకర్ భార్యను వేధిస్తుండటంతో ప్రియుడు, ఆమె కలిసి అతడిని అంతమొందించాలని పథకం పన్నారు. మాయమాటలతో జహంగీర్ అతడిని మంగళవారం మైతాప్ ఖాన్ గూడకు తీసుకునివెళ్లి మద్యం తాగించాడు. 

తాగిన మైకంలో ఉన్న అతడిపై రాళ్లతో దాడి చేసి Murderకు ప్రయత్నించాడు. తీవ్రగాయాల పాలైన శివశంకర్ రోడ్డుపై పడిపోవడంతో స్థానికులు వికారాబాద్ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ.. గురువారం మృతి చెందాడు. ఫోన్ కాల్ డేటా ఆధారంగా కేసును ఛేదించారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు