సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో భారీగా గంజాయి పట్టివేత.. కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో..

By team teluguFirst Published Oct 30, 2021, 2:29 PM IST
Highlights

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో (Secunderabad Railway Station) భారీగా గంజాయి పట్టుబడింది. కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో 54 కేజీల గంజాయిని రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో తనిఖీ చేపట్టిన రైల్వే పోలీసులు గంజాయిని (Ganja) పట్టుకున్నారు. 

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో (Secunderabad Railway Station) భారీగా గంజాయి పట్టుబడింది. కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో 54 కేజీల గంజాయిని రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో తనిఖీ చేపట్టిన రైల్వే పోలీసులు గంజాయిని (Ganja) పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి వెయిటింగ్ హాలులో అనుమానంగా సంచరిస్తున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ గ్యాంగ్ కోణార్ ఎక్స్‌ప్రెస్‌ ద్వారా విశాఖ నుంచి సికింద్రాబాద్ మీదుగా ముంబైకి గంజాయి చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ గ్యాంగ్‌లో ఒడిశాకు చెందిన ఇద్దరు, ముంబైకి చెందిన ఇద్దరు ఉన్నారు.

వీరివద్ద నుంచి స్వాధీనం చేసుకన్న గంజాయి విలువ రూ. 16 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందితులపై పీడి యాక్ట్ నమోదు చేసినట్లు తెలిపారు. గంజాయి మూఠాపై ఇప్పటివరకే మూడు కేసులు ఉన్నాయని చెప్పారు.

Also reda: విశాఖపట్నం సీలేరు నుంచి హైదరాబాద్‌కు గంజాయి.. 70 కిలోలు స్వాధీనం..

ఇక, పోలీసులు హైదరాబాద్ నగరంలో గత కొద్దిరోజులుగా విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. అంతేకాకుండా నిఘాను కూడా పెంచారు. ఈ క్రమంలోనే ఎల్బీనగర్‌ 110 కిలో గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టుగా శుక్రవారం వెల్లడించారు. ఇందుకు సంబంధించి ఇద్దరు అంతరాష్ట్ర నేరగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు విశాఖ ఏజెన్సీ నుంచి హైదరాద్‌ మీదుగా మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు గంజాయిని తరలిస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు. 

Also read: అరటి పండ్ల లోడ్‌లో 110 కిలోల గంజాయి.. ఎల్‌బీ నగర్‌లో పట్టుకున్న పోలీసులు.. విశాఖ ఏజెన్సీ నుంచి..

గంజాయిని పట్టుకునేందకు స్పెషల్ డ్రైవ్‌ను నిర్వహిస్తున్నామని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ చెప్పారు. ఈ క్రమంలోనే విశాఖ ఏజెన్సీ నుంచి నాగ్‌పూర్‌కు రవాణా చేస్తున్న 110 కిలోల గంజాయిని సీజ్ చేశామని తెలిపారు. నిందితులు అరటి పండ్ల లోడ్‌లో ఏర్పడకుండా గంజాయి తరలిస్తున్నట్టుగా తెలిపారు. పట్టుబడిన గంజాయి విలువ రూ. 18.50 లక్షలు ఉంటుందని చెప్పారు. నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు రవాణాకు ఉపయోగించిన మిని ట్రాన్స్‌పోర్ట్ వాహనాన్ని, మూడు మొబైల్ ఫోన్లను, రూ. 1100 నగదును స్వాధీనం చేసుకున్నట్టుగా వెల్లడించారు. అయితే మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని సీపీ చెప్పారు. డ్రగ్స్ నివారణకు నయా సవేరా కార్యక్రమంతో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్టుగా సీపీ చెప్పారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లోన డ్రగ్స్ నివారణపై అవగాహన కల్పిస్తున్నట్టుగా తెలిపారు.

click me!