రేపు టీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వం.. 16న కేసీఆర్ సమక్షంలో కారెక్కనున్న ఎల్ రమణ

Siva Kodati |  
Published : Jul 11, 2021, 04:13 PM IST
రేపు టీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వం.. 16న కేసీఆర్ సమక్షంలో కారెక్కనున్న ఎల్ రమణ

సారాంశం

టీఆర్ఎస్‌లో చేరేందుకు ఎల్ రమణ అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే టీటీడీపీ అధ్యక్ష పదవికి, తెలుగుదేశం ప్రాథమిక సభ్యత్వానికి ఆయన రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. 

టీటీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్ రమణ రేపు టీఆర్ఎస్  పార్టీ ప్రాథమిక సభ్యత్వం తీసుకోనున్నారు. ఆయనకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాథమిక సభ్యత్వం ఇవ్వనున్నారు. అనంతరం ఈ నెల 16న సహచరులతో కలిసి టీఆర్ఎస్‌లో చేరనున్నారు ఎల్ రమణ. 

కాగా, టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎల్. రమణ రాజీనామా చేశారు.  త్వరలోనే ఆయన టీఆర్ఎస్ లో చేరనున్నారు. గురువారం నాడు సీఎం కేసీఆర్ తో ఎల్. రమణ భేటీ అయ్యారు. తన రాజీనామా పత్రాన్ని శుక్రవారం నాడు చంద్రబాబునాయుడుు పంపారు రమణ. కొంత కాలంగా టీడీపీని వీడి  టీఆర్ఎస్ లో చేరాలని ఎల్. రమణ భావిస్తున్నారు. రమణతో  తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు  పలు దఫాలుగా చర్చలు జరిపారు.ఈ చర్చలు ఫలవంతమయ్యాయి. దయాకర్ రావు దగ్గరుండి గురువారంనాడు రమణను  కేసీఆర్ వద్దకు తీసుకెళ్లారు.

Also Read:టీడీపీ అధ్యక్ష పదవికి రాజీనామా, టీఆర్ఎస్‌లో చేరుతా: తేల్చేసిన ఎల్. రమణ

ప్రజలకు మరింత చేరువయ్యేందుు టీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయం తీసుకొన్నానని ఆయన ప్రకటించారు. రాష్ట్ర ప్రగతిలో భాగస్వామ్యం కావాలని అనుకొంటున్నానని ఆయన చెప్పారు. మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో రాజీనామా చేస్తున్నట్టుగా ఆయన ప్రకటించారు.  30 ఏళ్లుగా తనకు తోడ్పాటును అందించిన చంద్రబాబుకు ఆ లేఖలో ధన్యవాదాలు తెలిపారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో టీడీపీ తెలంగాణ కన్వీనర్ గా కొనసాగారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత టీడీపీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా పనిచేశారు. రెండు టర్మ్‌లుగా ఆయన పనిచేస్తున్నారు.  

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ