చంద్రబాబుపై కేసీఆర్ తిట్ల దండకం.. ప్రజాకోర్టులో సీఎంకు శిక్ష: ఎల్. రమణ

By sivanagaprasad kodatiFirst Published Oct 4, 2018, 1:16 PM IST
Highlights

టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ఫైరయ్యారు. హైదరాబాద్‌ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన నిజామాబాద్ ప్రజా ఆశీర్వాద సభలో చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. 

టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ఫైరయ్యారు. హైదరాబాద్‌ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన నిజామాబాద్ ప్రజా ఆశీర్వాద సభలో చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు.

టీడీపీ..కాంగ్రెస్‌తో పొత్తును వ్యతిరేకిస్తున్న కేసీఆర్... 2009లో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోలేదా..? అని ప్రశ్నించారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను చంద్రశేఖర్ రావు అప్పులపాలు చేశారని విమర్శించారు. కేసీఆర్ కుటుంబ పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పించాలన్న లక్ష్యంతోనే తాము మహాకూటమిలో చేరినట్లు తెలిపారు.

టీఆర్ఎస్‌కు ఓటేస్తే బీజేపీకి వేసినట్లేనని ప్రజలు భావిస్తున్నారని.. ప్రజాధనంతో ప్రగతి భవన్‌లో కేసీఆర్ కుటుంబం విలాసవంతమైన జీవితాన్ని గడుతోందని రమణ ఆరోపించారు. ప్రజాకోర్టులో ముఖ్యమంత్రికి శిక్ష తప్పదని వ్యాఖ్యానించారు. 

టీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ వాయిదా.. కేసీఆర్ అనూహ్య నిర్ణయం

నిజామాబాద్ ప్రజా ఆశిర్వాద సభలో కేసీఆర్ (పోటోలు)

టీఆర్ఎస్ కు ఈసీ షాక్

కాంగ్రెస్, టీడీపీ పొత్తు ఎఫెక్ట్: కేసీఆర్ సెంటిమెంట్ అస్త్రం

రేవంత్ విచారణ: కేసీఆర్ నోట చంద్రబాబు పేరు, దేనికి సంకేతం?

ఓటుకు నోటులో అడ్డంగా దొరికిన దొంగ: బాబుపై కేసీఆర్ సంచలనం

కాంగ్రెస్ ఎఫెక్ట్: మళ్లీ అధికారంలోకి వస్తే పెన్షన్‌ను పెంచుతాం: కేసీఆర్


 

click me!