అసెంబ్లీలో ఉత్తమ్ గడ్డం పై ఎర్రబెల్లి సెటైర్

Published : Nov 03, 2017, 12:46 PM ISTUpdated : Mar 25, 2018, 11:47 PM IST
అసెంబ్లీలో ఉత్తమ్ గడ్డం పై ఎర్రబెల్లి సెటైర్

సారాంశం

ఉత్తమ్ గడ్డం మీద ఎర్రబెల్లి సెటైర్ చర్చను రేవంత్ మీదకు తిప్పిన ఎర్రబెల్లి అసెంబ్లీ లాబీల్లో సరదా సంభాషణ

తెలంగాణ అసెంబ్లీ లాబీల్లో ప్రత్యర్థి పార్టీల నేతల మధ్య సంభాషణలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. అన్ని పార్టీల ఎమ్మెల్యేలు సభలో ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటారు కానీ... సభ నుంచి బయటకు అంటే లాబీల్లోకి కాలు పెట్టగానే ఆహ్లాదంగా మాట్లాడుకుంటారు. జోకులు వేసుకుంటారు. ఆత్మీయత పంచుకుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో పరుషంగా మాట్లాడుకొని తిట్టుకున్నవారు కూడా ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కొందరు గల్లలు పట్టుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి. అందుకే అసెంబ్లీ లాబీల్లో రిపోర్టర్లు ఎఫ్పుడెప్పుడు ఎవరెవరు ఏం మాట్లాడుకుంటారా? ఏం చేస్తారా అని వాచ్ చేస్తూ ఉంటారు.

అయితే తాజగా అసెంబ్లీ లాబీల్లో పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి,  టిడిపి నుంచి టిఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒకరినొకరు ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య ఆసక్తికరమైన చర్చ నడిచింది.

ఎర్రబెల్లి : అన్నా ఏం సంగతే..? గడ్డం ఎప్పుడు తీస్తవు అన్నా?

ఉత్తమ్ : 2019 ఎన్నికలు అయిపోంగనే తీస్త.

ఎర్రబెల్లి : అబ్బో.. అవునానే?

ఉత్తమ్ : అది సరే చాలా కూల్ గా ఉన్నవేందే ?

ఎర్రబెల్లి : నాకు టెన్షన్స్ పోయినయ్. ఆ టెన్షన్లు ఇప్పుడు నీకు షురూ అయినయ్. 

 (రేవంత్ కాంగ్రెస్ లో చేరిన విషయమై ఎర్రబెల్లి సెటైర్ వేశారు. దీంతో ఇద్దరూ నవ్వుకుంటూ అక్కడి నుంచి ఎవరి దారిన వారు వెళ్లిపోయారు.)

 

చంద్రబాబుకు గుడి కట్టిస్తామంటున్న హిజ్రాలు

ఈ వార్తతోపాటు మరిన్ని తాజా వార్తలకోసం కింద క్లిక్ చేయండి

https://goo.gl/NY4JPG

PREV
click me!

Recommended Stories

అమెరికాలో ఎన్టీఆర్‌..CMగా నాదెండ్ల.. నెల రోజుల CMజీవితంలో Cinema మించిన Twists | Asianet News Telugu
Elderly Man Rescued :కుంటలో కూరుకుపోయిన వృద్ధుడు..తాడుతో బయటకు తీసిన పోలీసులు | Asianet News Telugu