అసెంబ్లీలో జాంపండ్లు పంచిన కోనేరు కోనప్ప

Published : Nov 03, 2017, 02:00 PM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
అసెంబ్లీలో జాంపండ్లు పంచిన కోనేరు కోనప్ప

సారాంశం

జాంపండ్లు పంచిన కోనేరు కోనప్ప జాంపడ్లు తింటూ ఫొటోలు దిగిన జర్నలిస్టులు గతంలో అంబలి పంచిన కోనప్ప

సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నివేళలా ఆసక్తికరమైన పనులు చేస్తారు. ఉమ్మడి రాష్ట్రంలోనైనా, ఇప్పుడైనా అసెంబ్లీ సమావేశాలు జరిగే వేళలో అయినా.. అసెంబ్లీ సమావేశాలు లేని సమయంలోనైనా ఆయన చేసిన అనేక పనులను జనాలు కీర్తించారు.

గతంలో వేసవి కాలంలో ఆయన తన నియోజకవర్గంలో అంబలి కేంద్రాలు ఏర్పాటు చేసి జనాలకు అంబలి పంచి ఎండ వేడిమి నుంచి కాపాడే ప్రయత్నం చేశారు. అలాగే అసెంబ్లీలోనూ ఎమ్మెల్యేలకు, మీడియా ప్రతినిధులకు, గన్ మెన్లకు, సెక్యూరిటీ సిబ్బందికి, అసెంబ్లీ సిబ్బందికి, వచ్చిపోయే విజిటర్స్ కు అందరికీ అంబలి తెప్పించి పంచాడు.

అంతేకాదు సిర్పూర్ నియోజకవర్గంలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దీంతో తాను ప్రత్యేక శ్రద్ధ తీసుకుని తన నియోజకవర్గంలో ఉన్న ప్రతి హాస్టల్ విద్యార్థికి బ్లాంక్లెట్లు పంపిణీ చేసి శభాష్ అనిపించుకున్నారు.

తాజాగా కోనేరు కోనప్ప శుక్రవారం నాడు అసెంబ్లీకి 80 కిలోల జామపండ్లు తెచ్చాడు. వాటిని అసెంబ్లీ సభ్యులకు, మీడియా ప్రతినిధులకు పంపిణీ చేశాడు. దీంతో జర్నలిస్టులు జామపండ్లు తింటూ సరదాగా ఫొటోలు దిగారు. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాకు ఎక్కినయ్. 

ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీ లో  నేదురుమల్లి రాజ్యలక్ష్మి పళ్లు పంచిన విషయాన్ని ఇది గుర్తు చేస్తుంది.  నాటి మంత్రి రాజ్యలక్ష్మి ప్రతిసెషన్ ప్రారంభంలో జాం పండ్లు, రేగిపండ్లు,  స్వీట్లు తెచ్చి సభ విరామసమయంలో అందరికి పంచేది.

మొత్తానికి కోనేరు కోనప్ప ఏం చేసినా అద్భుతమే సుమా అంటున్నారు జామపండ్లు తిన్న జర్నలిస్టు మిత్రులు.

 

చంద్రబాబుకు గుడి కట్టిస్తామంటున్న హిజ్రాలు

ఈ వార్తతోపాటు మరిన్ని తాజా వార్తలకోసం కింద క్లిక్ చేయండి

https://goo.gl/NY4JPG

PREV
click me!

Recommended Stories

Hyderabad: కేవలం రూ. 1 కే కడుపు నిండా భోజనం..
KTR Counter to Uttam Kumar Reddy: కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు| Asianet News Telugu