ఎస్సీ వర్గీకరణపై కమిటీ పేరుతో ప్రధాని మోదీ మభ్యపెడుతున్నారు.. మంత్రి కేటీఆర్

By Sumanth Kanukula  |  First Published Nov 12, 2023, 5:06 PM IST

షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) వర్గీకరణ డిమాండ్‌పై కమిటీని ఏర్పాటు చేస్తానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చి ప్రజలను మోసం చేశారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు ఆరోపించారు.


హైదరాబాద్: షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) వర్గీకరణ డిమాండ్‌పై కమిటీని ఏర్పాటు చేస్తానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చి ప్రజలను మోసం చేశారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు ఆరోపించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జాతీయ పార్టీ అయిన బీజేపీ పోటీలోనే లేదని సెటైర్లు వేశారు. అయితే ఎస్సీ వర్గీకరణ డిమాండ్‌కు సంబంధించి మాదిగల సాధికారత కోసం సాధ్యమైన అన్ని మార్గాలను అవలంబించేందుకు కేంద్రం త్వరలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తుందని ప్రధాని మోదీ శనివారం సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఎమ్ జరిగిన సభ వేదికగా తెలిపారు.

అయితే మోదీ కామెంట్స్‌పై స్పందించిన కేటీఆర్.. ‘‘మళ్లీ కమిటీ అంటే ఆలస్యం న్యాయం. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మేము చాలా కాలం క్రితం రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసాము. ఒకవేళ మోదీకి చిత్తశుద్ధి ఉంటే.. దానిని అమలు చేయాలి. ఆయన అధ్యయనం కోసం మరో కమిటీని నియమించకూడదు. ప్రాథమికంగా ఈ సమస్యపై ఆయనకు ఆసక్తి లేదు. మోదీ ప్రజలను మభ్యపెడుతున్నాడని అర్థం అవుతుంది’’ అని అన్నారు. మోదీ ఆయన చేయగలిగినదంతా చేయవచ్చని.. నిజానికి మోదీ పార్టీ తెలంగాణలో పోటీలోనే లేదని విమర్శించారు. 

Latest Videos


ఇదిలాఉంటే, శనివారం పరేడ్ గ్రౌండ్స్ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. మాదిగల హక్కుల కోసం 30 ఏళ్లుగా పోరాడుతున్న మందకృష్ణ మాదిగ కృషిని ప్రశంసించారు. ‘‘ఈ అన్యాయాన్ని వీలైనంత త్వరగా అంతం చేయడానికి మేము కట్టుబడి ఉన్నాము. మేము త్వరలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తాము, అది మీకు సాధికారత కల్పించడానికి సాధ్యమయ్యే అన్ని మార్గాలను అవలంబిస్తాము. సుప్రీం కోర్టులో పెద్ద చట్టపరమైన ప్రక్రియ జరుగుతోందని మీకు, మాకు కూడా తెలుసు. మీ పోరాటం న్యాయమైనదని మేము భావిస్తున్నాము.

మేము న్యాయం జరిగేలా చూస్తాము. న్యాయస్థానంలో కూడా మీకు న్యాయం జరిగేలా చూడడం భారత ప్రభుత్వం ప్రధాన ప్రాధాన్యత. పూర్తి శక్తితో, భారత ప్రభుత్వం మీ సహోద్యోగిలా న్యాయానికి అనుకూలంగా నిలుస్తుంది’’ అని ప్రధాని మోదీ అన్నారు.
 

click me!