సీఎంకు కూడా బాకీ ఇచ్చాడుగా.. సంపన్న నేత వివేక్ అఫిడవిట్‌లో ఆసక్తికర విషయాలు

By Mahesh K  |  First Published Nov 12, 2023, 5:04 PM IST

మాజీ ఎంపీ వివేక్ సంపన్న నేత. ఆయన సీఎం కేసీఆర్‌కు కూడా బాకీ ఇచ్చారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కూడా బాకీ ఇచ్చిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
 


హైదరాబాద్: తెలంగాణలో అత్యంత సంపన్న నేతగా కాంగ్రెస్ లీడర్, మాజీ ఎంపీ వివేక్ ఉన్న సంగతి తెలిసింద. రూ. 606.67 కోట్లతో ఆయనే సంపన్న నేత అని అఫిడవిట్‌లలో తేలిపోయింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అత్యధిక సంపన్నుడై ఉంటాడనీ చాలా మంది అనుకున్నారు. దీనితోపాటు మరో ఆసక్తికర విషయం కూడా వివేక్ అఫిడవిట్‌తో వెలుగులోకి వచ్చింది. ఈ సంపన్న నేత సీఎం కేసీఆర్‌కు కూడా అప్పు ఇచ్చాడని తెలిసింది.

చెన్నూర్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ టికెట్ పై బరిలోకి దిగుతున్న మాజీ ఎంపీ వివేక్ మొత్తం ఆస్తులు 606.67 కోట్లు. అందులో చరాస్తులు రూ. 380.76 కోట్లు, స్థిరాస్తులు రూ. 225.91 కోట్లుగా ఉన్నది. వీటితోపాటు దంపతులిద్దరికి కలిపి రూ., 45 కోట్లు అప్పు ఉన్నట్టు అఫిడవిట్‌లో వివేక్ పేర్కొన్నారు.

Latest Videos

Also Read: తెలంగాణలో కర్ణాటక రాజకీయం.. అధికార, ప్రతిపక్ష నేతల మాటల తూటాలు.. బీఆర్ఎస్‌కు కలిసొచ్చేనా?

ఇదిలా ఉండగా.. ఈ సంపన్న నేత సీఎం కేసీఆర్‌కు రూ. 1.06 కోట్లు అప్పు ఇచ్చాడని తెలిసింది. అలాగే.. మరో సంపన్న నేత, మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి రూ. కోటిన్నర అప్పు ఇచ్చారట. ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మొన్నటి వరకు బీజేపీలో కీలక స్థానంలో ఉన్న వివేక్ అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీలోకి చేరిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా చెన్నూరులో బరిలోకి దిగుతున్నారు. పార్టీలకు అతీతంగా ఆయన అప్పులు ఇచ్చినట్టు ఈ వార్తతో తెలుస్తున్నది.

click me!