సానుభూతి కోసమే కేసీఆర్‌పై ఆరోపణలు, ఏపీలో జరిగేదే జరుగుతోంది: కేటీఆర్

By narsimha lodeFirst Published Mar 4, 2019, 11:44 AM IST
Highlights

ఏపీ ప్రజల సానుభూతి కోసమే చంద్రబాబునాయుడు కేసీఆర్‌పై ఆరోపణలు చేస్తున్నారని  టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. చంద్రబాబునాయుడు ఎన్ని చిల్లర రాజకీయాలు చేసినా కూడ జరగాల్సింది జరుగుతోందన్నారు.
 

 హైదరాబాద్: ఏపీ ప్రజల సానుభూతి కోసమే చంద్రబాబునాయుడు కేసీఆర్‌పై ఆరోపణలు చేస్తున్నారని  టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. చంద్రబాబునాయుడు ఎన్ని చిల్లర రాజకీయాలు చేసినా కూడ జరగాల్సింది జరుగుతోందన్నారు.

సోమవారం నాడు ఆయన టీఆర్ఎస్ శాసనసభపక్ష కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఏపీ ప్రభుత్వం మళ్లీ మళ్లీ అదే తప్పు  చేస్తోందన్నారు. ఏపీ ప్రజల అనుమతి లేకుండా సేవా మిత్ర యాప్‌లోకి ఈ సమాచారాన్ని ఎలా చేరవేస్తున్నారని కేటీఆర్ ప్రశ్నించారు.

మా మీద ఆరోపనలు చేయడానికి ఏపీ సీఎం చంద్రబాబుకు సిగ్గుండాలని కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఐదేళ్లలో ఏపీ ప్రజలకు ఏం చేశారో చెప్పుకొని ఓట్లు అడగాలని కేటీఆర్ కోరారు. కానీ, ప్రజలకు ఏం చేసిందో చెప్పుకోలేక ఉద్వేగాన్ని రెచ్చగొట్టేందుకు చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు.

ఏపీ ప్రజల డేటాతో తమకు ఏం అవసరం ఉంటుందని  కేటీఆర్ ప్రశ్నించారు. ఓటుకు నోటుకు కేసులో చంద్రబాబునాయుడు అడ్డంగా దొరకలేదా అని కేటీఆర్ ప్రశ్నించారు.

హైద్రాబాద్ లో ఉంటున్న లోకేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి  ఫిర్యాదు మేరకు తెలంగాణ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేశారని కేటీఆర్ వివరించారు. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని టీడీపీ యాప్‌లోకి ఎలా చేరుతోందని ఆయన ప్రశ్నించారు.  

ఐటీ చట్టాన్ని ఉల్లంఘించి ఏపీ ప్రజల సమాచారాన్ని ఐటీ గ్రిడ్ సంస్థ సమాచారాన్ని తస్కరిస్తోందని లోకేశ్వర్ రెడ్డి ఫిర్యాదు చేశారని చెప్పారు.ఈ ఫిర్యాదు మేరకు తెలంగాణ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.

ఐటీ గ్రిడ్ సంస్థ కార్యాలయం హైద్రాబాద్‌లోనే ఉందన్నారు.ఈ సంస్థపైనే హైద్రాబాద్‌లోనే ఫిర్యాదు అందిందని ఆయన గుర్తు చేశారు.  ఏపీ పోలీసులు  వచ్చి తెలంగాణకు వచ్చి తెలంగాణలో పోలీసులను అడ్డుకోవడం సరైందేనా అని ఆయన ప్రశ్నించారు.తెలంగాణలో ఏపీ పోలీసులకు ఏం పని ఆయన ప్రశ్నించారు.

తప్పు చేయకపోతే టీడీపీ నేతలు ఎందుకు భయపడుతున్నారని కేటీఆర్ ప్రశ్నించారు.కంప్యూటర్లోని సమాచారాన్ని దొంగతనం చేయడం కరెక్టేనా అని కేటీఆర్ అన్నారు.తెలంగాణ పోలీసులు పక్షపాతం లేకుండా పనిచేశారని కేటీఆర్ చెప్పారు.ఐటీ గ్రిడ్‌ సంస్థ ఏ తప్పు చేయకపోతే తెలంగాణ పోలీసులు క్లీన్ చిట్ ఇస్తారని కేటీఆర్ తెలిపారు.

సంబంధిత వార్తలు

టీడీపీ యాప్ సర్వీస్ ప్రోవైడర్ వివాదం: కేసీఆర్‌పై భగ్గుమన్న చంద్రబాబు

ఏపీ పోలీసులు బెదిరిస్తున్నారు, రక్షణ కల్పించండి: లోకేశ్వర్ రెడ్డి

డేటా చోరీ: బాబుతో అడ్వకేట్ జనరల్ భేటీ, ఏం చేద్దాం

డేటావార్: కూకట్‌పల్లిలో ఏపీ పోలీసులకు నో ఎంట్రీ

డేటా చోరీపై ట్విస్ట్: భాస్కర్‌ కోసం హైద్రాబాద్‌కు ఏపీ పోలీసులు

click me!