వేములవాడ: వంద పడకల ఆసుపత్రిని ప్రారంభించిన కేటీఆర్

By Siva Kodati  |  First Published May 28, 2021, 4:40 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో వంద పడకల ఆసుపత్రిని మంత్రి కేటీఆర్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఆసుపత్రిలో వున్న ఐసీయూ బెడ్లు వేములవాడలో కూడా వున్నాయన్నారు


రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో వంద పడకల ఆసుపత్రిని మంత్రి కేటీఆర్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఆసుపత్రిలో వున్న ఐసీయూ బెడ్లు వేములవాడలో కూడా వున్నాయన్నారు. సిరిసిల్లలో లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంక్ ఏర్పాటు చేసుకున్నట్లుగానే... వేములవాడలో కూడా త్వరలోనే తీసుకొస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. ఆక్సిజన్ కొరత లేకుండా చూసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.

Also Read:88 ఫిర్యాదులు.. 24 గంటల్లో వివరణ ఇవ్వాలి: ప్రైవేట్ ఆసుపత్రులకు తెలంగాణ సర్కార్ ఆదేశం

Latest Videos

అన్ని మందులు అందుబాటులో వున్నాయని... ఇప్పటికే జిల్లాలో ఇంటింటి సర్వేను పూర్తి చేశామని, 3,900 మందికి కిట్లు కూడా ఇచ్చామని కేటీఆర్ తెలిపారు. దీని వల్ల ఆసుపత్రికి వెళ్లకుండానే.. కోవిడ్ నియంత్రణలోకి వస్తుందని మంత్రి పేర్కొన్నారు. బ్లాక్ ఫంగస్‌కు సంబంధించి కూడా మందులు అందుబాటులో వుంచామని కేటీఆర్ స్పష్టం చేశారు. 

click me!