ఎన్టీఆర్ జయంతి: సంక్షేమంలో స్వర్ణయుగమంటూ షర్మిల ట్వీట్

By Siva KodatiFirst Published May 28, 2021, 3:39 PM IST
Highlights

టీడీపీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు 98వ జయంతి నేడు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులే కాకుండా ఆయన అభిమానులు, టీడీపీ శ్రేణులు, సినీ ప్రముఖులు ఆయనకు నివాళులర్పిస్తున్నారు. తాజాగా దివంగత వైఎస్సార్ కుమార్తె వైఎస్ షర్మిల కూడా ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయన శ్రద్ధాంజలి ఘటించారు.

Also Read:మా గుండెలను మరొక్కసారి తాకిపో తాతా.. పెద్ద ఎన్టీఆర్‌కి, చిన్న ఎన్టీఆర్‌ నివాళి

నాడు తెలంగాణ పటేల్, పట్వారీ వ్యవస్థలను ఎన్టీఆర్ రద్దు చేశారని ఆమె కొనియాడారు. బీసీలకు చట్టసభల్లో రాజకీయ అవకాశాలు, మహిళలకు ఆస్తిహక్కు కల్పించిన వ్యక్తి రామారావు అని షర్మిల ప్రశంసించారు. ముఖ్యంగా, రెండు రూపాయలకే కిలోబియ్యంతో పేదవాడి ఆకలిని తీర్చారని ఆమె గుర్తుచేసుకున్నారు. ఇవాళ ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా వారి సంక్షేమాన్ని గుర్తుచేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు ఓ పత్రికలో సంక్షేమంలో స్వర్ణయుగం అంటూ ఎన్టీఆర్ పై వచ్చిన కథనాన్ని కూడా షర్మిల పంచుకున్నారు.

పటేల్..పట్వారి వ్యవస్థలను రద్దు చేసి..
బిసి లకు చట్టసభల్లో రాజకీయ అవకాశాలు..మహిళలకు ఆస్థి హక్కు కల్పించి..రెండు రూపాయలకే కిలో బియ్యంతో పేదవాడి ఆకలిని తీర్చిన..
నందమూరి తారక రామారావు గారిని..
వారి జన్మదినం సందర్భగా..వారి సంక్షేమాన్ని గుర్తుచేసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది pic.twitter.com/zYmIlfO31w

— YS Sharmila (@realyssharmila)
click me!