నవంబర్ 15న వరంగల్‌లో తెలంగాణ విజయ గర్జన సభ:కేటీఆర్

By narsimha lodeFirst Published Oct 13, 2021, 12:49 PM IST
Highlights


ఈ నెల 17వ తేదీన టీఆర్ఎస్ అధ్యక్ష పదవికి ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుందని ఆ పార్టీ వర్కింగ్  ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. వచ్చే నెల 15న  వరంగల్ లో తెలంగాణ విజయ గర్జన పేరుతో సభ నిర్వహిస్తున్నామన్నారు.

హైదరాబాద్: ఈ నెల 17వ తేదీన టీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక కోసం ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ktr చెప్పారు.హైద్రాబాద్‌లోని తెలంగాణ భవన్ లో  బుధవారం నాడు  trsవర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.

టీఆర్ఎస్  రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్ విడుదలైన రోజు నుండి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుందన్నారు.ఈ నెల 22వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ జరగనుంది.ఈ నెల 23న నామినేషన్ల స్కృట్నీని నిర్వహిస్తామని కేటీఆర్ తెలిపారు.

also read:పేద విద్యార్థిని ఎంబీబీఎస్ చదువుకు మంత్రి కేటీఆర్ సహకారం..

ఈ నెల 24న నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించామన్నారు కేటీఆర్. ఈ నెల 25న రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక కోసం  హెచ్ఐసీసీలో  టీఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశం నిర్వహిస్తున్నామన్నారు.ఈ సమావేశానికి 14 వేల మంది ప్రతినిధులు హాజరు కానున్నారని ఆయన తెలిపారు. అదే రోజు పార్టీ ప్లీనరీని నిర్వహిస్తామన్నారు.గత సాధారణ ఎన్నికలు కోవిడ్ నేపథ్యంలో పార్టీ ప్రతినిధుల సభ, ప్లీనరీ జరగలేదని ఆయన గుర్తు చేశారు.

telangana bhavan లో పార్టీ అధ్యక్ష పదవికి నామినేషన్లు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ ఎన్నికల నిర్వహణకు గాను ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి election officer గా వ్యవహరిస్తారని కేటీఆర్ చెప్పారు.టీఆర్ఎస్‌లో వార్డు స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు కమిటీల ఏర్పాటు పూర్తైందన్నారు. ఈ నెల 17వ తేదీన  టీఆర్ఎస్ శాసనసభపక్షంతో పాటు పార్లమెంటరీ పార్టీ పక్షంతో  కేసీఆర్ సమావేశం కానున్నారని కేటీఆర్ తెలిపారు.   

నవంబర్ 15న వరంగల్‌లో తెలంగాణ విజయగర్జన

రెండు దశాబ్దాల టీఆర్ఎస్ పోరాటాలు, రెండు పర్యాయాలు తెలంగాణలో అధికారాన్ని చేపట్టి ప్రజల సంక్షేమం చేస్తున్న కార్యక్రమాలను గుర్తు చేసుకొనేందుకు గాను నవంబర్ 15న వరంగల్ లో తెలంగాణ విజయగర్జన పేరుతో భారీ సభను ఏర్పాటు చేస్తున్నామని కేటీఆర్ చెప్పారు. ఈ సభకు లక్షలాది మంది  హాజరు కావాల్సిందిగా ఆయన కోరారు.

తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టిన టీఆర్ఎస్ అనేక విజయాలను నమోదు చేసుకొందని కేటీఆర్ గుర్తు చేశారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకతను సంపాదించుకొందన్నారు. తమ రాష్ట్రం చేపట్టిన పథకాలను దేశంలోని పలు రాష్ట్రాలు కూడ అనుసరిస్తున్నాయన్నారు. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం కూడ ఇదే తరహలో పథకాలను తీసుకొచ్చిందని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.

అతి స్వల్పకాలంలోనే దేశంలోని అన్ని రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందన్నారు. తెలంగాణ రాష్ట్రం దేశానికి జాతిసంపద సృష్టికి ఏ రకంగా కృషి చేస్తోందో ఆర్‌బీఐ  నివేదికను చూస్తే అర్ధమౌతోందన్నారు.

click me!