శ్రీశైలం, సాగర్, పులిచింతల్లో విద్యుత్ ఉత్పత్తిని ఆపేయండి: తెలంగాణకు కేఆర్ఎంబీ ఆదేశం

Siva Kodati |  
Published : Jul 15, 2021, 08:35 PM IST
శ్రీశైలం, సాగర్, పులిచింతల్లో విద్యుత్ ఉత్పత్తిని ఆపేయండి: తెలంగాణకు కేఆర్ఎంబీ ఆదేశం

సారాంశం

శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లో తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలని కేఆర్ఎంబీ ఆదేశించింది. ఈ మేరకు గురువారం తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది.   

తెలంగాణ ప్రభుత్వానికి కేఆర్ఎంబీ లేఖ రాసింది. శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లో తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలని కేఆర్ఎంబీ ఆదేశించింది. సాగు, తాగు నీటి అవసరాలకు నీరు విడుదల చేసినప్పుడే విద్యుత్ ఉత్పత్తి చేయాలని కేఆర్ఎంబీ తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. 

అంతకుముందు కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)  ఛైర్మెన్ ఎంపీ సింగ్ తో  ఏపీ నీటి సంఘాల ప్రతినిధులు గురువారం నాడు భేటీ అయ్యారు.హైద్రాబాద్‌ జలసౌధలో ఏపీ  నీటి సంఘాల ప్రతినిధులు కేఆర్ఎంబీ ఛైర్మెన్ తో భేటీ అయ్యారు.కృష్ణా డెల్టా, నాగార్జునసాగర్ ఆయకట్టు ప్రతినిధులు ఆయనతో సమావేశమయ్యారు.

Also Read:కేఆర్ఎంబీ ఛైర్మెన్‌తో ఏపీ నీటి సంఘాల ప్రతినిధుల భేటీ: తెలంగాణపై ఫిర్యాదు

 తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో ఏపీలో రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని కేఆర్ఎంబీకి ఏపీ నీటి సంఘాల ప్రతినిధులు ఫిర్యాదు చేశారు.  కృష్ణా నదిపై నిర్మించిన ఉమ్మడి ప్రాజెక్టుల్లో తెలంగాణ ప్రభుత్వం ఇటీవల జల విద్యుత్ ను ఉత్పత్తి చేసింది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు నిండకుండా నీరంతా వృధాగా సముద్రంలోకి వెళ్లిందని ఏపీ ప్రభుత్వం ఆరోపించింది. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!
Hyderabad: మ‌రో హైటెక్ సిటీ రాబోతోంది.. డేటా సెంట‌ర్ల‌తో HYDలోని ఈ ప్రాంతం పూర్తిగా మార‌నుంది