చదువుకున్నోళ్లందరికీ సర్కారీ నౌకరీ రాదు: మంత్రి నిరంజన్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Jul 15, 2021, 6:34 PM IST
Highlights

తెలంగాణలో మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారు. కొద్దిరోజుల క్రితం పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మహిళా ఎంపీడీవోపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. తాజాగా వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి వివాదాస్పద కామెంట్లు చేశారు.

తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చదువుకున్నోళ్లందరికీ ప్రభుత్వ ఉద్యోగం రాదంటూ వ్యాఖ్యానించారు. నాగర్‌కర్నూల్ జరిగిన ఓ సమీక్షా సమావేశంలో పాల్గొన్న నిరంజన్ రెడ్డి.. కొనుగోలు కేంద్రాల వద్ద చేసే హమాలీ పని ఉపాధి కాదా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో హమాలీ పని కంటే మించిన ఉపాధి ఏముందని కామెంట్ చేశారు నిరంజన్ రెడ్డి. 

కాగా, కొద్దిరోజుల క్రితం మహిళా ఎంపీడీవోపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేసిన అనుచిత వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే.  గ్రామసభలో అందరి ముందు అవమానపరిచేలా అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. వరంగల్ జిల్లా కమలాపూర్ మండలం ఉప్ప‌ల్‌లో నిర్వహించిన గ్రామసభలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఎర్రబెల్లి కామెంట్స్‌తో ఎంపీడీవో షాక్‌కు గురయ్యారు. 

Also Read:గ్రామసభలో అందరిముందూ .. మహిళా ఎంపీడీవోపై అసభ్యకర వ్యాఖ్యలు, వివాదంలో ఎర్రబెల్లి

‘‘ మేడం.. మీరు బాగానే ఊపుతున్నారు.. కానీ ఇక్కడ ఊపడం లేదు’’ అంటూ ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు. దీంతో మంత్రి వెనకాలే వున్న మహిళా ఎంపీడీవోకు ఏం చేయాలో అర్ధం కాక నిర్ఘాంతపోయారు. అందరిముందు మంత్రి అవమాన పరిచేలా కామెంట్స్ చేసినా ఏమి అనలేని పరిస్ధితి. ప్రస్తుతం ఎర్రబెల్లి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మహిళా అధికారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.

click me!